అల్లు అర్జున్ బ్రేక్ తీసుకోవాలనుకొంటున్నాడట...
స్టైయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బద్రీనాథ్" ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కులు మనాలీలో జరుగుతోంది. ఈ చిత్రం కోసం మనాలీలో 60రోజుల సుదీర్ఘ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫైట్స్ ను కులుమనాలీలో చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ఆద్వర్యంలో ఈ ఫైట్స్ చిత్రీకరణ జరుగుతోంది. కులు మనాలీలో వేసిన ఓ భారీ సెట్ లో ఫైట్స్ చిత్రీకరిస్తున్నారట. ఈ సినిమాకి యాక్షన్ ఎపిసోడ్ హైలెట్ అవుతుందని యూనిట్ అంటోంది. అయితే బన్ని 60 రోజులు ఇంటిని వదిలి ఉండటం అల్లు అర్జున్ కి ఇబ్బందిగా ఉందట. అందుకని కొంత బ్రేక్ తీసుకుని హైదరాబాద్ వచ్చి ఇంట్లో సేద తీరి వెళ్లాలనుకుంటున్నాడని సమాచారం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన తమన్నా కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. చిన్నికృష్ణ అందించిన కథతో యంయం కీరవాణి సంగీత దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











