అల్లు అర్జున్ ‘బద్రినాథ్’ డివైండ్ అయినా ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్..!
అల్లు అర్జున్ కథానాయకుడిగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'బద్రినాథ్" చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫస్ట్ షోకే ఈ చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ ప్రారంభ వసూళ్లు మాత్రం అదిరిపోయాయి. ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 1400 థియేటర్స్ లో 5600 రికార్డ్ షోష్ ఇచ్చారు. ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు ఓవరాల్ గా 7కోట్ల 50 లక్షల గ్రాస్ ను వసూలు చేసిందని, నైజాంలో 1కోటి 64లక్షలు వసూలు చేయగా, సీడెడ్ లో కోటీ 42లక్షలు వసూలు చేసిందని వైజాగ్ లో 75లక్షలు కలెక్ట్ చేసిందని గీతా ఆర్ట్స్ సంస్థ విడుదల చేసిన ఓ ప్రెస్ నోట్ లో తెలిపింది.
అంతే కాదు ఇది మొదటి రోజు రికార్డుల్లో ఆల్ టైం గ్రాసర్ రికార్డుగా కూడా ఆ సంస్థ తెలిపింది. కాగా ఇంకా ట్రేడ్ అంచనాల ప్రకారం 15% ఫస్ట్ డే కలెక్ట్ చేసిందని, శుక్రవారం విడుదల దాని తర్వాత వరుసగా వచ్చిన శని, ఆదివారంలో మరికొంత భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశముందని తెలిపారు. కాగా అల్లు అరవింద్ రీసెంట్ గా విడుదలై 100% లవ్ చిత్రం 11కోట్ల బడ్జెట్ అయినా మంచి కలెక్షన్స్ తో ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోదంని అయితే అరవింద్ పరిస్థితే బద్రినాథ్ డివైడ్ టాక్ వచ్చినందుకు ఏడవాలో లేక 100% లవ్ సక్సెస్ కి నవ్వాలో తెలియని పరిస్థిలో వున్నాడట...


Click it and Unblock the Notifications











