అల్లు అర్జున్ 'బద్రీనాధ్' చిత్రం విడుదల తేది ఎప్పుడంటే...
అల్లు అర్జున్ తాజా చిత్రం బద్రీనాధ్ ని మే 21న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆడియోని మే మొదటి వారంలో రిలీజ్ చేస్తారు. ఈ వారంతో ఈ చిత్రం షూటింగ్ పూర్తవుతుంది.ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది.మరో ప్రక్క వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లు జరుగుతున్నాయి. దాదాపు నలభై కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా అభివర్ణిస్తున్నారు. వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఇండియన్ సమురాయి గా కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ వివరిస్తూ...'బద్రీనాథ్"లో మరోసారి మాస్ పాత్రలో నటిస్తున్నా. ఓ చారిత్రక కథాంశం వున్న సినిమా అని అనుకుంటున్నారంతా. అది నిజంకాదు. ఒకానొకప్పటి దేవాలయం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నా రోల్ ఇండియన్ సమురాయ్. కత్తి, డాలు గిరగిరా తిప్పుతాను, ఫైట్లు అలరిస్తాయి. బాగా వర్క్ అవుట్ అయ్యే సినిమా ఇది.
సమురాయ్ గా నన్ను ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. తుపాకుల కంటే కత్తులు, కటారులు బాగా పనిచేస్తాయనడానికి చాలా ఉదాహరణలు వున్నాయి. టాప్ టెన్ యాక్షన్ సినిమాలను పరిశీలిస్తే... ఆ విషయం అర్థమవుతుంది అన్నారు. ఇక ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. బన్నీ తర్వాత వివి వినాయిక్..అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇది కావటంతో మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.ఈ చిత్రం అనంతరం అల్లు అర్జున్ దాదాపు యాభై కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమయ్యే చిత్రంలో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











