కులుమనాలీలో సగం పని కానిచ్చేసిన అల్లు అర్జున్-తమన్నా...
గత ఒకటిన్నర నెలగా కులుమనాలిలో భారీ షెడ్యూల్ చేసిన 'బద్రీనాథ్" యూనిట్ రేపు(23.09.10) హైదరాబాద్ కి తిరిగి వస్తోంది. అల్లు అర్జున్, తమన్నా హీరో హీరోయిన్స్ గా, గ్రేట్ యాక్టర్ నానాపటేకర్ మరో ముఖ్య పాత్రధారిగా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బేనర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్. కాగా 'బద్రీనాథ్" కోసం కులుమనాలిలోనే ఓ పెద్ద సెట్ వేయించిన వినాయక్ అక్కడ 30 శాతం టాకీ పార్ట్ తో బాటు పీటర్ హెయిన్స్ ఆద్వర్యంలో ఓ ఇంట్రెస్టింగ్ యాక్షన్ ఎపిసోడ్ నీ చిత్రీకరించారు. అలాగే బన్నీ తమన్నాల పై మూడు పాటలనూ ఫిక్ష్చరైజ్ చేశారు. సో..అక్కడే సగం పని కానిచ్చేసిన బన్నీ-తమన్నాలు ఇక్కడ మరో మూడు పాటలన్నిటికీ తనే డ్యాన్స్ కంపోజ్ చేస్తూ సింగిల్ కార్డ్ వేయించుకోనున్న ప్రేమ్ రక్షిత్ ఇందులో బన్నీ కోసం ఎన్నో వెరైటీ స్టెప్స్ ని కంపోజ్ చేసినట్టు తెలుస్తోంది..


Click it and Unblock the Notifications











