స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి అన్నీ అడ్డంకులే...
వివి వినాయక్ డైరెక్షన్ లో చేస్తోన్న 'బద్రీనాథ్" కోసం అల్లు అర్జున్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మరీ వచ్చాడు కానీ ఆ సినిమా నిర్మాణానికి మాత్రం ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. మొదట నటీనటుల ఎంపికే క్లిష్టతరంగా మారి చివరికి వాలీవుడ్ నుంచి నానాపటేకర్ ని తెచ్చుకోవడం వరకూ తెగించినా ఆ తర్వాత హీరోయిన్ గా తమన్నా డేట్స్ ప్రాబ్లెం వచ్చింది. ఆపై వినాయక్ తండ్రి స్వర్గస్తులవడంతో మళ్ళీ కొన్నాళ్లు షూటింగ్ కి బ్రేక్ పడింది కాగా రీసెంట్ గా కులుమనాలిలో ఓ భారీ సెట్ వేసి షూటింగ్ స్టార్ట్ చేశఆరు కానీ అక్కాడా ఇబ్బదులు తప్పట్లేదీ యూనిట్ కి. పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో ఓ యాక్షన్ ఎపిసోడ్ చేసేందుకు గత వారం రోజులుగా శ్రమిస్తున్నా వరుణుడు మాటి మాటికీ అడ్డం పడుతున్నాడట. మరీ అవరోధాలన్నింటినీ అధిగమించి సంక్రాంతి బరిలోకి 'బధ్రీనాథ్" రాగలడో లేదో చూడాలి.
అల్లు అర్జున్ తమన్నా హన్సిక బద్రీనాథ్ వివి వినాయక్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ allu arjun tamanna hansika badrinath vv vinayak allu aravind geetha arts


Click it and Unblock the Notifications