twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కథ విని భవిష్యత్ ను చెప్పగల మేధావి: అల్లు అరవింద్

    By Sindhu
    |

    మెగా స్టార్ కొడుకు 'రామ్ చరణ్" నటించిన మగధీర తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది. 'మగధీర"తర్వాత ఇంత వరకు ఏ సినిమా 'మగధీర" రికార్డులను దాటలేకపోయింది. మగధీర విజయానికి హీరో, దర్శకుడే కాక మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. అతడే అల్లు అరవింద్.! ముందు కథ విని భవిష్యత్ ను చెప్పగల మేధావి. తన మేనల్లుడికి మంచి హిట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఎంత ఖర్చు పెట్టైనా 'మగధీర"ను తీసి పెద్ద హిట్ ను రామ్ చరణ్ కు అంకితం చేశాడు. ఈ సినిమాతో రామ్ చరణ్" ప్రేక్షకుల గుండెల్లో 'మాస్" హీరోగా పేరు సంపాదించిుకున్నాడు. ఇప్పుడొస్తున్న యువ హీరోలలో రామ్ చరణ్ నెం.వన్ ఇప్పటి వరకు యువ హీరోల్లో దూసుకుపోతున్న అల్లు అర్జున్ వెనకంజ వేశాడు. పైగా మెగాస్టార్ కొడుకు కాబట్టి రామ్ చరణ్ కు ఆక్రేజ్ ఉండటం సహజం. వెంటనే అల్లు అరవింద్ తన మెదడుకు పనిపెట్టి. అల్లు అర్జున్ ను మాస్ హీరోగా చేయకపోతే రామ్ చరణ్ దెబ్బకు తట్టుకోలేడేమోనని 'బద్రీనాథ్" మొదలెట్టాడు.

    గత కొంతకాలంగా ప్రేక్షకుల్లో, అల్లు అర్జున్ అభిమానుల్లో ఎంతో ఉత్కంఠని కలిగిస్తున్న సినిమా బద్రీనాథ్. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వినాయక్ దర్శకత్వం అంటే పక్కాగా మాస్ అని చెప్పవచ్చు. దాదాపు వినాయక్ దర్శకత్వంలో అన్ని సినిమాలు హిట్ లిస్ట్ లోనే ఉన్నాయి. కాగా వివి వినాయక్ ఈ సినిమా గురించి చెబుతూ బన్నీ ఈ సినిమాలో శివక్షేత్ర పాలకుడిగా కనిపిస్తారని, నటుడిగా అతనిలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుందని అన్నారు. ఈ సినిమా చూస్తుంటే ఒక అద్భుతాన్ని చూస్తున్నట్లుగా ప్రేక్షకులు ఫీలవుతారని తెలిపారు. అల్లు అరవింద్ ఈచిత్రానికి నిర్మాత. ఇంతకుముందు ఆయన నిర్మించిన మగధీర తెలుగ సినీ చరిత్రలోనే బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది. తమన్నా ఇందులో నాయికగా నటిస్తుంది.

    English summary
    Allu Arjun who is currently busy with semi-periodic film, Badrinath says that he is trying to take a break from love stories in this New Year. This stylish star opined that he is stepping into new pathway with his undershoot film Badrinath. Tamannah is playing Bunny’s love interest in the film. Being directed by V.V.Vinayak and produced by Allu Aravind under the banner Geeta Arts, Chinni Krishna is the man behind the story of Badrinath.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X