అల్లు అర్జున్ 'బద్రీనాధ్' రిలీజ్ డేట్ ప్రకటన
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తమ బ్యానర్ పై నిర్మిస్తున్న "బద్రీనాధ్" చిత్రం విడుదల తేదీని మార్చి 27గా ప్రకటించారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కథని చిన్ని కృష్ణ అందించారు. ఆ చిత్రంలో అల్లు అర్జున్ కొత్తగా కనిపిస్తాడని, ఓ విభిన్నమైన పాత్రలో కనిపిస్తాడని చెప్తున్నారు. తమన్నాకీ అల్లు అర్జున్ కీ వచ్చే ప్రేమ సన్నివేసాలు హైలెట్ గా కనిపించనున్నాయి.
అలాగే కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్..మొదటి చిత్రం గంగోత్రి అనంతరం కీరవాణి మళ్ళీ అల్లు అర్జున్ తో చేయలేదు. ఇక చిన్ని కృష్ణ కూడా గంగోత్రి తర్వాత అల్లు అర్జున్ కి కథ ఇచ్చిన చిత్రం ఇదే. కమల్ కన్నన్ (మగధీర ఫేమ్) ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ సమకూరుస్తున్నారు. దశావతారం, రాఘవన్, అపరిచితుడు వంటి భారీ చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన రవి వర్మన్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. బన్నీ తర్వాత వివి వినాయిక్..అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇది.


Click it and Unblock the Notifications











