»   » వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ కోటీశ్వరుడు అల్లు అర్జున్!

వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ కోటీశ్వరుడు అల్లు అర్జున్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్‌ ఫేస్‌బుక్‌ పేజీని లైక్‌ చేసిన అభిమానుల సంఖ్య కోటికి చేరింది. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు స్టార్‌ అల్లు అర్జున్‌ కావడం విశేషం. గతంలో 1 మిలియన్ మార్కును అందుకున్న తొలి స్టార్ కూడా అల్లు అర్జునే కావడం గమనార్హం. ఈ పేజీని అల్లు అర్జున్‌ అనుమతితో ఆయన అభిమానులు నిర్వహిస్తున్నారు. తన సినిమాలకు, జీవితానికి సంబంధించిన అనేక అంశాలను అభిమానులతో పంచుకోవడానికి అల్లు అర్జున్‌ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లను వేదికలుగా ఉపయోగించుకుంటున్నారు.

ఎమ్మెల్యేకు రక్షకుడిగా అల్లు అర్జున్!

ప్రస్తుతం అల్లు అర్జున్ సరైనోడు చిత్రంలో నటిస్తున్నాడు...అల్లు అర్జున్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం బిజినెస్ ప్రాసెస్ మొదలైంది. సినిమాకు సంబంధించిన ‘ఫస్ట్ లుక్' విడుదల తర్వాత వచ్చే హైప్ ఆదారంగా బిజినెస్ మొదలు పెట్టాలని ముందు నుండి ప్లాన్ చేస్తున్నారు. అనుకున్న విధంగానే ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది.

Allu Arjun Becomes First Telugu Actor to Get 1 cr Facebook Fans

అల్లు అర్జున్ హీరో కావడం, బోయపాటి దర్శకత్వం కావడంతో సినిమాపై ముందు నుండీ మంచి అంచనాలే ఉన్నాయి. ఫస్ట్ లుక్ తర్వాత సినిమాకు ఉన్న హైప్ రెట్టింపు అయింది. దీంతో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 70 కోట్లకు తగ్గకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇది ఎంత వరకు సాధ్యం అనేది చూడాలి. ఇప్పటి వరకు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలకు మాత్రమే ఈ రేంజిలో బిజినెస్ జరిగింది.

అల్లు అర్జున్ కూడా ఈ రేంజి బిజనెస్ ను రీచ్ కాగలిగితే....... టాప్-3 పొజిషన్ అల్లు అర్జున్ సొంతం కావడం ఖాయం. ఇంతకు ముందు అల్లు అర్జున్ నటించిన రేస్ గుర్రం చిత్రం రూ. 60 కోట్ల బిజినెస్ చేసింది. ఈ నేపథ్యంలో ‘సరైనోడు' చిత్రానికి రూ. 70 కోట్ల బిజినెస్ సాధ్యమే అంటున్నారు ట్రేడ్ వర్గాలు.

బన్నీ సొంత బేనర్లో... ఆయన తండ్రి అల్లు అరవింద్ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్‌ జన్మదినం సందర్భగా ఏప్రిల్‌ 8న చిత్రాన్ని విడుదల చేసేందుకుసన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్‌తో కూడిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

English summary
Allu Arjun Becomes First Telugu Actor to Get 1 cr Facebook Fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu