రేపటినుంచే అల్లు వారి కొత్తఖాతా: అభిమానులకు మరింత దగ్గర అవుతున్న బన్నీ
మరో రెండు రోజుల్లో అయన ఈ అకౌంట్ ద్వారా తన జ్ఞాపకాలను ఈ సోషల్ మీడియా లో పదిలపరుచుకోవడమే కాకుండా ఫాన్స్ తో ఉన్న మధురానుభూతులను కూడా అందులో పంచుకోనున్నాడట అల్లు అర్జున్ .
అల్లు అర్జున్ కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ .. అయన సోషల్ మీడియా అకౌంట్ చూస్తే తెలుస్తుంది. టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోగా ఫాలోయింగ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు ? ఇప్పటికే పేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్స్ ద్వారా తన ఫాన్స్ కు దగ్గరగా ఉన్న బన్నీ .. ఇప్పుడు వారికీ మరింత దగ్గరయ్యేందుకు సిద్ధం అవుతున్నాడు.

ఫాన్స్ తో ఉన్న మధురానుభూతులు
మరో రెండు రోజుల్లో అయన ఈ అకౌంట్ ద్వారా ప్రేక్షకుల్లోకి రానున్నాడు. బన్నీ తన జ్ఞాపకాలను ఈ సోషల్ మీడియా లో పదిలపరుచుకోవడమే కాకుండా ఫాన్స్ తో ఉన్న మధురానుభూతులను కూడా అందులో పంచుకోనున్నాడట.
Recommended Video


ఇన్స్టాగ్రామ్ ఖాతా
ప్రస్తుతం బన్నీ నటిస్తున్న నాపేరు సూర్య సినిమా ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అల్లు అర్జున్ ఇప్పటికే పేస్ బుక్, ట్విట్టర్ లో ఆయనకు బోలెడు క్రేజ్ వుంది. లక్షల్లో అభిమానులు వున్నారు. ఇప్పుడు ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు.

నవంబర్ 21 నుంచి
విషయాన్ని బన్ని ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. ‘జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవడం అంటే నాకిష్టం. మధురానుభూతిగా నిలిచిపోయే ఫొటోలంటే ఇష్టం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలతో నా ప్రయాణం నవంబర్ 21 నుంచి మొదలుపెట్టబోతున్నాను' అంటూ వెల్లడించారు బన్నీ.

నా పేరు సూర్య
ప్రస్తుతం బన్నీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాతో బిజీగా వున్నాడు. వక్కంతం వంశీ ఈ సినిమాకి దర్శకుడు. మొత్తానికి అల్లు అర్జున్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయడంతో ఫాన్స్ తెగ ఖుషి పడుతున్నారు.


Click it and Unblock the Notifications











