రామ్ చరణ్, పవన్ కన్నా అల్లు అర్జున్ బెటర్?
చిరు ప్యామిలీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్,రామ్ చరణ్ తేజ ల కన్నా అల్లు అర్జునే బెటర్ అని అంటున్నారు. దానికి కారణం అతని సినిమాలు స్పీడుగా ఫినిష్ కావటమేనని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ..జల్సా చిత్రం వచ్చి చాలా కాలం అవుతోంది. అయితే పులి ఇప్పటి వరకూ రిలీజ్ కాలేదు. ఇప్పటికీ సరైన డేట్ ప్రకటించటం లేదు. సినిమా సినిమాకీ చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. ఇక రామ్ చరణ్ కూడా తన బాబాయ్ పవన్ రూటు లోనే ప్రయాణం చేస్తున్నాడని అంటున్నారు. చిరుత కీ మగధీర కీ చాలా గ్యాప్ వచ్చింది. అలాగే ఇప్పుడు బొమ్మరిల్లు బాస్కర్ తో చేస్తున్న ఆరెంజ్ చిత్రం కూడా పూర్తి కావటానికి చాలా టైమ్ పడుతుంది. అందులోనూ అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆరెంజ్ చిత్రం స్క్రిప్టు ఇంకా పూర్తి కాలేదు. దాంతో అసలే స్లోగా సినిమా చేసే భాస్కర్ మరింత మెల్లిగా ఏ పది నెలలకో ఈ చిత్రం పూర్తి చేస్తాడని అంటున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కెరీర్ మాత్రం ఇందుకు భిన్నంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. సినిమా ..సినిమాకీ మద్య గ్యాప్ బాగా తక్కువ ఉండేలా చూసుకుంటున్నాడు. త్వరలో ఆర్య-2 వస్తోంది. అనంతరం గుణశేఖర్ దర్శకత్వంలో చేస్తున్న వరుడు పూర్తయినట్లేనని తెలుస్తోంది. మరో ప్రక్క క్రిష్ రూపొందిస్తున్న వేదం సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. భవిష్యత్ ప్రాజెక్టులు కూడా ఇంతే స్పీడుగా ముగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకే వీరిద్దరి కన్నా అల్లు అర్జున్ బెస్ట్ అంటున్నారు.


Click it and Unblock the Notifications











