బన్నీ-భాస్కర్ సినిమా జనవరిలో
స్టయిలిస్ స్టార్ అల్లు అర్జున్- బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో రూపొందబోతున్న కొత్త సినిమా 2012 జనవరిలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఊసరవెల్లి చిత్ర నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన కథా చర్చలు ఇటీవలే ముగిశాయి. సినిమా ఫైనలైజ్ కావడంతో దర్శకుడు గ్రౌండ్ వర్క్ ప్రారంభించినట్లు తెలుస్తూంది. సినిమా హీరోయిన్ తో పాటు, ఇతర నటీనటులను ఎంపిక చేయాల్సి ఉంది. ఆరెంజ్ సినిమాతో భారీ ప్లాపును మూటగట్టుకున్న భాస్కర్ ఈ సారి మళ్లీ తన మార్కు సినిమాతో హిట్ సాధించాలనే కసితో ఉన్నారు.
మరో వైపు బద్రీనాథ్ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో మళ్లీ బన్నీ, హ్యాపీ లాంటి వినోదభరితమైన సినిమాలు చేయాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలం పాటు ప్రయోగాల జోలికి పోకుండా తిన్నగా కమర్షియల్ ఎలిమెంట్ష్ ఉన్న సినిమాలు మాత్రమే చేయాలని బన్నీ డిసైడ్ అయ్యాడని ఫిల్మ్ నగర్ టాక్. పరాజయం చవి చూసి ఈ ఇద్దరికీ ఈ సారైనా విజయం వరిస్తుందో..? లేదో..?


Click it and Unblock the Notifications











