Don't Miss!
- Sports గుజరాత్ చరిత్రలో అత్యల్ప స్కోరు.. దుమ్ముదులిపిన ఢిల్లీ బౌలర్లు
- News తెర మీదకు ఓటుకు నోటు కేసు .. టార్గెట్ చంద్రబాబు
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
- Lifestyle కొత్తగా పెళ్ళైన జంటలు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీ లైఫ్ సేవ్ చేస్తుంది
బన్నీ బర్త్ డే : ప్రేమను కురిపించిన చిరు.. మెగాస్టార్ నిక్ నేమ్‌ను బయట పెట్టిన స్టైలీష్ స్టార్
నేడు (ఏప్రిల్ 8) స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ మేరకు నిన్నటి నుంచే హడావిడి మొదలైంది. కామన్ డీపీలంటూ ఫ్యాన్స్ రచ్చ చేయగా.. బన్నీ-సుకుమార్ ప్రాజెక్ట్ అప్డేట్ నిన్న ట్రెండ్ అయింది. ఇక నేటి ఉదయం నుంచి బన్నీకి విషెస్ వెల్లువెత్తున్నాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ సెలెబ్రిటీల వరకు బన్నీకి విషెస్ చెబుతున్నారు. బన్నీకి ఎంత మంది విషెస్ చెప్పినా.. మెగాస్టార్ చిరంజీవి తెలిపే శుభాకాంక్షలు ఎప్పటికీ ప్రత్యేకమే.
బన్నీ బర్త్ డే హల్చల్..
సోషల్ మీడియాలో అల్లు అర్జున్ బర్త్ డే మార్మోగిపోతోంది. హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్ సెలబ్రెటీలంతా అల్లు అర్జున్‌కు విషెస్ చెబుతున్నారు. ఇక ఫ్యాన్స్ చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు అర్జున్ పుట్టిన రోజును దేశమంతా తెలిసేలా ట్వీట్స్, లైక్స్ చేస్తున్నారు.
చిరు ట్వీట్ వైరల్..
తనకు ఏప్రిల్ ఎనిమిదో తారీఖుతో ఎంతో అనుబంధంముందని హింట్ ఇస్తూ నిన్న చేసిన ట్వీట్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే అందులో కచ్చితంగా బన్నీ గురించి ఏదో ఒక విషయం చెబుతాడని అందరూ ఊహించిందే. అందుకు తగ్గట్టే చిరు కురిపించిన ప్రేమకు బన్నీ తడిసి ముద్దయ్యాడు.
|
నువ్వు బాగుండాలబ్బా..
బన్నీ చిన్న నాటి ఫోటోను షేర్ చేస్తూ.. డ్యాన్స్‌లో గ్రేస్ ఆ వయసు నుంచే ఉంది.. బన్నీలో కసి, కృషి నాకు ఇష్టం.. హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్.. నువ్వు బాగుండాలబ్బా.. అంటూ చేసిన చిరు ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Recommended Video
చిక్కబాబి అంటూ నిక్ నేమ్..
చిరు కురిపించిన ప్రేమలో తడిసిన బన్నీ.. థ్యాంక్యూ సో మచ్ చిక్కబాబి.. మీ ట్వీట్స్ చూడటం చాలా ఆనందంగా ఉంది.. నా జీవితానికి మెగాస్టార్ ఈ ట్వీట్ సరిపోతుంది.. థ్యాంక్యూ అంటూ రిప్లై ఇచ్చాడు. అయితే చిక్కబాబి అంటూ సంబోధించడంతో అందరూ ఆలోచనలో పడ్డారు. మొత్తానికి బన్నీ చిరును అలా పిలుస్తాడన్న మాట.