ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ సర్ప్రైజ్ బర్త్ డే గిఫ్ట్.. అదేమిటంటే..
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా. ఈ చిత్రం వచ్చేనెల రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఇప్పటికే రిలీజైన నా పేరు సూర్య టీజర్లు, ట్రైలర్లకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలకు ముందే సంచలనం రేపుతున్న నా పేరు సూర్య మరో సెన్సేషన్‌కు సిద్ధమైంది. అదేమిటంటే
ఏప్రిల్ 8 తేదీన స్టైలిష్ స్టార్ జన్మదినం. ఈ సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్టును అందించేందుకు అల్లు అర్జున్ సిద్ధమయ్యాడు. ఈ నెల 8న నా పేరు సూర్య సినిమాకు సంబంధించిన డైలాగ్ ఇంపాక్ట్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ నటించిన ఈ చిత్రం మే 4న రిలీజ్ కానున్నది. మెగా బ్రదర్ నాగబాబు సమర్పిస్తున్న ఈ చిత్రానికి లగడపాటి శిరీష్, బన్నీవాసు నిర్మిస్తున్నారు. కథా, మాటల రచయిత వక్కంతం వంశీ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


Click it and Unblock the Notifications











