Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
చిన్నప్పటి నుంచీ నువ్వే.. ఈసారైనా నేను చేయాల్సింది.. బన్నీకి విషెస్ చెప్పిన రామ్ చరణ్
రామ్ చరణ్-అల్లు అర్జున్ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ మధ్య ఉన్న రిలేషన్, అనుబంధాల గురించి ఎన్నో వేదికల మీద, ఎన్నో ఇంటర్వ్యూల్లో వారిద్దరు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి వేదిక ఎక్కితే అభిమానుల సందడి ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా.. సోషల్ మీడియా మొత్తం విషెస్‌తో హోరెత్తిపోతోంది. తాజాగా రామ్ చరణ్ షేర్ చేసిన ఫోటో, చేసిన ట్వీట్ అభిమానులను ఇట్టే ఆకట్టుకుంటోంది. ఇంతకీ రామ్ చరణ్ ఏమని విష్ చేశాడో ఓ సారి చూద్దాం.
ట్విట్టర్లో ట్రెండింగ్..
బన్నీ బర్త్ డే.. నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. సౌత్ స్టార్‌గా ఫేమస్ అయిన అల్లు అర్జున్ బర్త్ డే.. బాలీవుడ్‌కు కూడా పాకింది. బాలీవుడ్ ప్రముఖులు సైతం బన్నీకి విషెస్ చెబుతున్నారు. దీంతో దెబ్బకు బన్నీ బర్త్ డే జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతోంది.
బన్నీకి మెగా విషెస్..
అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా బన్నీకి మెగా విషెస్ అందాయి. మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇలా మెగా హీరోలంతా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా రామ్ చరణ్ సైతం బన్నీ మీదున్న ప్రేమను చాటుకున్నాడు.
|
ఈ సారి నేను పెట్టాల్సింది..
బన్నీ పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ స్పందిస్తూ.. ‘చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో నువ్వే తినిపిస్తూ వస్తున్నావ్.. ఈ రోజు నేను నీకు కేక్ తినిపించాల్సింది.. హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్.. పోస్టర్ అదిరిపోయింద'ని ట్వీట్ చేశాడు.
Recommended Video
ఇదంతా పూర్తయ్యాక..
రామ్ చరణ్ షేర్ చేసిన ఫోటోను, చేసిన కామెంట్‌ను చూసిన బన్నీ వెంటనే స్పందించాడు. ఈ మేరకు బర్త్ డే విషెస్ చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపాడు. ఇదంతా (లాక్ డౌన్) పూర్తయ్యాక.. మళ్లీ మనిద్దరం కేక్ తినిపించుకుందామని క్యూట్ రిప్లై ఇచ్చాడు.