అల్లు అర్జున్‌ను మెగాస్టార్ అనేసిన స్టార్ సింగర్.. బన్నీ రియాక్షన్, నెటిజన్ల కామెంట్స్ వైరల్
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు నేడు (ఏప్రిల్ 8). ఈ మేరకు సోషల్ మీడియాలో జరుగుతున్న హల్చల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేటి ఉదయం నుంచి బన్నీకి విషెస్ వెల్లువల వస్తూనే ఉన్నాయి. సెలెబ్రిటీలు, ఫ్యాన్స్ చేసే ట్వీట్లతో దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ మేరకు బన్నీ బర్త్ డే హాట్ టాపిక్ అయింది. ఇందులో ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందించాడు. బర్త్ డే కానుకగ రిలీజైన పుష్ప పోస్టర్, ఫస్ట్ లుక్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. ఇవి కాకుండా బన్నీ వ్యక్తిత్వం, బన్నీపై చేసిన కామెంట్స్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా ఓ సింగర్ ఇచ్చిన ట్యాగ్ హైలెట్ అవుతోంది. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

ట్విట్టర్‌లో హాట్ టాపిక్..
బన్నీ బర్త్ డే, బన్నీ కొత్త సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ఇలా ప్రతీ ఒక్కటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాయి. ఈ మేరకు ఫ్యాన్స్, టాలీవుడ్ ప్రముఖులు చేసిన ట్వీట్స్ అందుకు ఉదాహరణ. బన్నీ బర్త్ డే, పుష్ప టైటిల్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి.

మెగా విషెస్..
గత కొంతకాలం నుంచి బన్నీ మెగా ఫ్యామిలీకి అంటి అంటనట్టు ఉంటున్నాడని రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అవన్నీ కేవలం రూమర్సేనని నేటితో మరోసారి రుజువైంది. చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక తమ ట్వీట్లతో బన్నీపై కురిపించిన ప్రేమను అందరూ చూశారు.

మెగాస్టార్ అని సంబోధించిన శ్రేయా ఘోషాల్..
శ్రేయా ఘోషాల్ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు. భారతీయ భాషలన్నింటిలో తన గాత్రాన్ని వినిపించి కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది శ్రేయా ఘోషాల్. తెలుగులో ఆమె పాడిన ఎన్నో మెలోడీలు క్లాసిక్‌గా నిలిచాయి. ఆలాంటి శ్రేయా ఘోషాల్ బన్నీకి విషెస్ చెబుతూ మెగాస్టార్ అల్లు అర్జున్ అని సంబోధించింది.
Recommended Video

బన్నీ రిప్లై, నెటిజన్స్ రియాక్షన్..
శ్రేయా ఘోషాల్ చెప్పిన బర్త్ డే విషెస్‌కు స్పందించిన బన్నీ.. మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు.. అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక శ్రేయా ఘోషాల్ ట్వీట్‌ను చూసిన బన్నీ ఫ్యాన్స్ తెగ మురిసి పోయారు. తదుపరి మెగాస్టార్ అల్లు అర్జున్ అని ముందే కనిపెట్టేసిందా? అని కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











