»   » అల్లు అర్జున్‌- బోయ‌పాటి...గీతాఆర్ట్స్ చిత్రం డీటేల్స్

అల్లు అర్జున్‌- బోయ‌పాటి...గీతాఆర్ట్స్ చిత్రం డీటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాక్సాఫీస్ క‌లెక్ష‌న్లని రేసుగుర్రంలా ప‌రిగెత్తించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వ‌రుస సూప‌ర్ స‌క్స‌స్‌ల‌తో ప‌వ‌ర్‌ఫుల్ దర్శ‌కుడిగా త‌న‌కంటూ బాక్సాఫీస్‌లో ప్ర‌త్యేక‌ స్థానం సంపాయించిన ప‌వ‌ర్ ఫుల్ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం సెట్స్ మీద‌కి వెల్ల‌నుంది.

అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మ్యూజిక్‌తో స‌క్స‌స్‌ల మీద స‌క్స‌స్‌లు కొడుతున్న థ‌మ‌న్. ఎస్.ఎస్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం మార్చిలో పూజా కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ని ప్రారంభిస్తారు.

ఈసంద‌ర్భంగా అల్లు అర‌వింద్ మాట్లాడుతూ .. అల్లు అర్జున్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేషన్ లో చిత్రం చేయాల‌ని చాలా రోజుల నుండి అనుకుంటున్నాం. బోయ‌పాటి శ్రీను చెప్పిన క‌థ నాకు, బ‌న్ని కి బాగా న‌చ్చి మా బ్యాన‌ర్ గీతాఆర్ట్స్ లో చేస్తున్నాం. అవుట్ అండ్ అవుట్ హీరోయిజం వుంటూ ప్యూర్ ల‌వ్ స్టోరి మిక్స్ అయిన క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నావతీ తెలిపారు.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Allu Arjun, Boyapati movie details

బ‌న్ని‌ని అభిమానులు, సినిమా ప్రేక్ష‌కులు ఎలా చూడాల‌ని అనుకుంటున్నారో ప‌క్కాగా అలాంటి కేర‌క్ట‌రైజేష‌న్ తో బోయ‌పాటి శ్రీను క‌థ చెప్ప‌టంతో అంద‌రికి న‌చ్చింది. రేసుగుర్రం చిత్రం త‌రువాత బ‌న్ని ఎన‌ర్జిని దృష్ఠిలో పెట్టుకుని త‌న స్టైల్ ని కొత్త‌గా క్రియోట్ చేశారు బోయ‌పాటి. ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టిస్తున్నారు. ఆ వివ‌రాలు త్వ‌ర‌లో చెబుతాం. రేసుగుర్రం చిత్రం త‌రువాత బ‌న్ని కాంబినేష‌న్ లో థ‌మ‌న్ చేస్తున్న రెండ‌వ చిత్రం ఇది. ఈ చిత్రాన్ని మార్చిలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించి ఏప్రిల్ నుండి రెగ్యుల‌ర్ షూటి్ంగ్ చేస్తున్నాము. ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని అల‌రించే విధంగా వుంటుంది.. హీరోయిన్స్ తో పాటు మిగ‌తా న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తామన్నారు అరవింద్.

ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ.. బ‌న్ని తో సినిమా ఎప్పుడో చేయాల్సింది. బ‌న్ని బాడీ లాంగ్వేజ్ కి స‌రిపోయో క‌రెక్ట్ క‌థ సిధ్ధంచేశాను. అర‌వింద్ గారు, బ‌న్ని ఈ క‌థ విని వెంట‌నే ఓకే చేశారు. ప‌క్కా అవుట్ అండ్ అవుట్ హీరోయిజం వున్న స్టోరి, హీరోయిజం వుంటూనే ల‌వ్ స్టోరి వుంటుంది. ఈచిత్రం లో కొత్త బ‌న్ని క‌న‌ప‌డ‌తాడనేది ఖ‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను. బ‌న్నితో చేయ‌టం అది కూడా అల్లు అర‌వింద్ గారు నిర్మాత గా గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో చిత్రం తెర‌కెక్క‌టం చాలా సంతోషంగా వుంది. ఈచిత్రం మార్చిలో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకొని, ఏప్రిల్ నుండి సెట్స్ మీద‌కి వెల్ల‌నున్నాము. ఈచిత్రం త‌రువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో మ‌రో చిత్రం చేయ‌నున్నాము. అది ఈ ఈ చిత్రం షూటి్ంగ్ పూర్త‌యిన వెంట‌నే వుంటుంది. అని అన్నారు. మ్యూజిక్- థ‌మ‌న్‌.ఎస్‌.ఎస్‌, మాట‌లు- ఎం.ర‌త్నం, నిర్మాత‌- అల్లు అరవింద్‌, క‌థ‌-స్క్రీన్‌ప్టే-ద‌ర్శ‌క‌త్వం - బోయపాటి శ్రీను.

English summary
According to the Allu Aravind, Allu Arjun has okayed Boyapati’s script and shooting of this film will go on floors in April.
Please Wait while comments are loading...