బోయపాటి-బన్నీ మూవీ ఖరారు, పూర్తి వివరాలు!
హైదరాబాద్: ‘లెజెండ్' సినిమాతో ఇటీవలే భారీ విజయం సొంతం చేసుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ లవ్ స్టోరీ చేద్దామని ప్లాన్ చేసారు. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించాల్సి ఉంది. అయితే ‘అల్లుడు శ్రీను' చిత్రం వల్ల బెల్లంకొండ ఫైనాన్సియల్ సమస్యల్లో పడ్డారు. దీంతో ఈ సినిమా అటకెక్కింది. అయితే వెంటనే బోయపాటి మరో సినిమాకు రెడీ అయ్యారు. అల్లు అర్జున్ కి స్టోరీ చెప్పి ఒప్పించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో బెల్లంకొండ మాట్లాడుతూ ఈ విషయం ఖరారు చేసారు. బన్నీకి ఇటీవలే స్టోరీ చెప్పానని, అల్లు అర్జున్, అల్లు అరవింద్ పూర్తి స్టోరీ విన్న తర్వాతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, వచ్చే ఏడాది మార్చిలో సినిమా మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు బోయపాటి వెల్లడించారు.

బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా గురించి మాట్లాడుతూ... శ్రీను కోసం మంచి లవ్ స్టోరీ రెడీ చేసారు. బెల్లంకొండ సురేష్ గారు కూడా సినిమాకు సరిపడేంత బడ్జెట్ పెట్టడానికి సిద్ధమయ్యారు. అయితే ప్రస్తుతం ఆయన సమస్యల్లో ఉన్నారు. అందుకే ప్రస్తుతానికి ఆ చిత్రాన్ని పక్కన పెట్టాల్సి వచ్చిందని బోయపాటి తెలిపారు.
ప్రస్తుతం నా చేతిలో ఆరు నెలల సమయం ఉంది. ఈ సమయం మొత్తం బన్నీ సినిమాపైనే పెట్టబోతున్నాను. బాలయ్య 100 సినిమా చేయడానికి నేను సిద్ధమే కానీ ప్రస్తుతం నా చేతిలో ఆయనకు సరిపడే స్టోరీ లేదు. సింహ, లెజెండ్ చిత్రాల తర్వాత మరో సినిమా చేయడం అంటే అంచనాలు భారీగా ఉంటాయి. స్టోరీ రెడీ చేయడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుంది అన్నారు.


Click it and Unblock the Notifications











