For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లు అర్జున్ స్క్రిప్టుకి బోయపాటి శ్రీను ప్రత్యేక పూజలు

  By Srikanya
  |

  అంతర్వేది : స్త్టెలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో కొత్త చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రముఖ సినీదర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు. అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని ఆయన సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారికి బోయపాటి శ్రీను ప్రత్యేక పూజలు చేసి, వేద మంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనం పొంది తీర్థప్రసాదాలు స్వీకరించారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  అనంతరం బోయపాటి శ్రీను మీడియాతో మాట్లాడుతూ .... త్వరలో తాను గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అర్జున్‌ హీరోగా నూతన చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను స్వామివారి పాదాల చెంత వుంచి పూజలు చేసినట్లు తెలిపారు. తారాగణాన్ని త్వరలో వెల్లడిస్తానని పేర్కొన్నారు.

  చిత్రం వివరాల్లోకి వెళితే..

  తొలి నుంచి తనదైన శైలిలో మాస్‌ కథల్ని తెరకెక్కించడంలో ప్రత్యేకత చూపుతూ హిట్స్ కొట్టడం బోయపాటి శ్రీను శైలి ప్రత్యేకం. 'భద్ర', 'తులసి', 'సింహా' చిత్రాలతో హిట్ చిత్రాల దర్శకుడయ్యారు. గతేడాది 'లెజెండ్‌'తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకొన్నారాయన. దాంతో అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు కథను సిద్ధం చేసుకొన్నారు. ఆ చిత్రం త్వరలో పట్టాలెక్కనున్నట్లు సమాచారం.

   Allu Arjun-Boyapati Srinu Film Script pooja

  అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘అల్లు అర్జున్‌, బోయపాటి శీను కాంబినేషన్‌లో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. బోయపాటి శ్రీను చెప్పిన కథ నాకు, బన్నికి బాగా నచ్చి మా గీతా ఆర్ట్స్‌లోనే చేస్తున్నాం. పూర్తిస్థాయి హీరోయిజం ఉంటూ ప్యూర్‌ లవ్‌ స్టోరీ మిక్స్‌ అయిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తాం. బన్నిని అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో పక్కాగా అలాంటి పాత్రతో బోయపాటి శీను కథ చెప్పారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. ఆ వివరాలను త్వరలో చెప్తాం. బన్ని కాంబినేషన్‌లో థమన్‌ చేస్తున్న రెండో సినిమా ఇది. మార్చిలో చిత్రాన్ని ప్రారంభించి ఏప్రిల్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ చేస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా అవుతుంది'' అని తెలిపారు.

  బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘బన్ని బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే కథను సిద్ధం చేశాను. అరవింద్‌గారు, బన్ని ఈ కథ విని వెంటనే ఓకే చేశారు. పక్కా అవుట్‌ అండ్‌ అవుట్‌ హీరోయిజం ఉన్న స్టోరీ ఇది. లవ్‌ స్టోరీ కూడా మిళితమై ఉంటుంది. కొత్త బన్ని కనిపిస్తారు. ఈ సినిమా తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తాను'' అని తెలిపారు.

  అల్లు అర్జున్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ సంస్థలో ఓ సినిమా రూపొందనుంది. .ఈ చిత్రం మార్చిలో పూజా కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ని ప్రారంభిస్తారు. థమన్‌.ఎస్‌.ఎస్‌. ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

  ఈ సినిమాకి సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., మాటలు: ఎం.రత్నం, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: బోయపాటి శీను.

  ప్రస్తుతం....

  త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు బన్ని. ఆ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను సినిమా కోసం బరిలోకి దిగాలని బన్ని నిర్ణయించుకొన్నారని తెలిసింది. గీతా ఆర్ట్స్‌ సంస్థలో తెరకెక్కనున్న ఆ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తారు.

  అల్లు అర్జున్‌ను తెరపై 'జులాయి'గా చూపించి ప్రేక్షకులకు వినోదాలు పంచారు త్రివిక్రమ్‌. ఆ ఇద్దరి కలయికలో ఇప్పుడు మరో చిత్రం తెరకెక్కుతోంది. సమంత, నిత్యమేనన్‌, ఆదాశర్మ హీరోయిన్స్. రాధాకృష్ణ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకు 'సన్నాఫ్‌ సత్యమూర్తి' అనే పేరు ఖరారు చేసినట్టు సమాచారం.

  త్రిశూలం, హుషారు, జాదూగర్ వంటి టైటిల్స్ పరిశీలనలకో వచ్చినా కథ ప్రకారం ఇదే సరైన టైటిల్ అని దర్శకుడు, హీరో భావించినట్లు సమాచారం. మార్చి చివరలో కాని,ఏప్రియల్ మొదటి వారంలో కానీ ఈ చిత్రం విడుదల అవనుంది. ఈ టైటిల్ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా పడుతుందని చెప్తున్నారు. తండ్రి కొడుకుల రిలేషన్ కూడా కథలో ప్రధానంగా సాగుతుందని అంటున్నారు.

  వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపించనున్నారు. బన్నీ సృష్టించే పెళ్లి సందడి.. వినోదాలు పంచనుంది. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ శివార్లలో ప్రత్యేకంగా ఓ సెట్‌ వేశారు. కీలకభాగం చిత్రీకరణ అక్కడే జరిగింది.

  ఇందులో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపిస్తాడనీ, సినిమా అంతా పెళ్లి సందడి మధ్య సాగుతుందని తెలుస్తోంది. రాజేంద్రప్రసాద్‌, ఉపేంద్ర, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

  English summary
  A prestigious film in the combination of Stylish Star Allu Arjun, who made box office collections like a race horse, and Powerful Director Boyapati Srinu, who carved a special image for himself at box office as a powerful director with series of super successes, will go on sets soon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X