మహేష్, జూ ఎన్టీఆర్‌లకు పోటీగా అల్లు అర్జున్ ప్రచారం
హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న మహేష్ బాబు ప్రస్తుతం యాడ్ ఫిల్మ్ మార్కెట్లో నెం.1 స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అనేక కార్పొరేట్ సంస్థలు మహేష్ బాబుతో తమ కంపెనీలకు ప్రచారం చేయించుకోవడానికి పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు సదరు కంపెనీల నుంచి బారీగానే రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నారు. జూ ఎన్టీఆర్ కూడా ఈ విషయంలో తక్కువేమీ కాదు. మలబ్బార్ గోల్డ్, నవర్ రత్న కూల్ టాల్క్ లాంటి సంస్థలకు ప్రాచారం చేసాడు.
మహేష్ బాబు జోస్ అలుకాస్ అనే ఆభరణాల సంస్థకు ప్రచారం చేస్తుండగా, జూ ఎన్టీఆర్ మలబ్బార్ గోల్డ్ సంస్థకు ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు వీరికి పోటీగా అల్లు అర్జున్ జాయ్ అలుకాస్ సంస్థ తరుపున ప్రచారం చేయడానికి రంగంలోకి దిగాడు. ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో యాడ్ చిత్రీకరణ కూడా జరిగింది. త్వరలోనే ఈ యాడ్ ప్రచారంలోకి రానుంది.
గతంలో అల్లు అర్జున్ కోల్గెట్, 7అప్ సంస్థలకు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జాయ్ అలుకాస్ డీల్ దక్కించుకోవడాన్ని బట్టి చూస్తే....బన్నీ కూడా యాడ్ ఫిల్మ్ రంగంలో తన సత్తాచాటేందుకు సిద్ధం అవుతున్నారని స్పష్టం అవుతోంది. మరిన్ని కంపెనీలు కూడా అల్లు అర్జున్‌తో డీలింగ్ జరుపుతున్నాయట.
అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే..
ప్రస్తుతం బన్నీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం చేస్తున్నారు. అల్లు అర్జున్ సరసన అమలపాల్, కేథరిన్ హీరోయిన్లుగా చేస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమకథా నేపథ్యంలో పూరి స్టయిల్ లో ఈచిత్రం సాగుతుంది.


Click it and Unblock the Notifications











