చిరంజీవి చేసిన విధంగానే 'బద్రినాథ్' లో పాట.. అల్లు అర్జున్
మెగాస్టార్ చిరంజీవిని గుర్తు చేసుకుని, ఆయన చేసిన విధంగానే 'బద్రినాథ్' సినిమాలో డ్యాన్స్ చేశానని అల్లు అర్జున్ అన్నారు. అలాగే కోట్ల వ్యయంతో ఒక యజ్ఞం లాగా ఈ సినిమా తీశామని, అదేవిధంగా హరీ ఓం... ఓం కాళీశ్వరి పాట హైలెట్‌గా నిలుస్తుందన్నారు.అల్లు అర్జున్ తాజా చిత్రం 'బద్రినాథ్' ఈ వారం లోనే విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.
అలాగే హిమాలయాల దగ్గర వేసిన భారీ సెట్‌లలో ఈ సినిమా దృశ్యాలు తెరకెక్కించామని చెప్పారు. బధ్రినాథ్ సినిమా కోసం ఆనందసాయి ఏకంగా 22 సెట్‌లు వేశారని, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇంత భారీ వ్యయంతో ఇంతకు ముందు ఏ సినిమా తీయలేదని అల్లు అర్జున్ చెప్పారు.
అంతేగాక బద్రినాథ్ సినిమా కోసం తాను వియత్నాంలో రెండు నెలల పాటు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నానని అన్నారు. జీరో డిగ్రీల ఉష్టోగ్రతలో షూటింగ్ చేస్తున్న సమయంలో దర్శకుడు వినాయక్ ఆనారోగ్యానికి గురయ్యారని, అక్కడే చికిత్స చేయించుకుని అదే రోజు మళ్లీ షూటింగ్ చేశామని అన్నారు. ఏడాది కాలంగా ఈ చిత్రంతోనే బిజీగా గడిపాననీ, తదుపరి చిత్రం ఏమిటనేది త్వరలో వెల్లడిస్తాను అన్నారు.


Click it and Unblock the Notifications











