బన్ని పెళ్ళయ్యాక మారిపోయాడని కంప్లైంట్

By Srikanya

అల్లు అర్జున్ పెళ్ళికి ముందు ఎలా ఉండేవాడు...ఇప్పుడెలా ఉన్నాడు అంటున్నాడు రామ్ చరణ్. పెళ్లికి ముందు చాలా ఎనర్జీగా ఉండే రామ్ చరణ్ ఇప్పుడు చాలా కామ్ అయిపోయాడు. ఇదంతా అతని భార్య స్నేహ చేసిన పనే అంటున్నాడు.ఆమె అతనిలో చాలా విషయాలు పాజిటివ్ గా మార్పు తీసుకు వచ్చింది. నా జీవితంలోనూ ఉపాసనా అలాంటి మార్పులు తెస్తుందని భావిస్తున్నాను. అలాగే నేను బన్నీని పెళ్లికి సంభందించి టిప్స్ అడిగాను. కానీ అవేమీ పనిచెయ్యలేదు.అవన్నీ వాటంతట అవే వస్తయని చెప్పాడని అంటున్నాడు. అలాగే అల్లు అర్జున్ భార్య చాలా పద్దతి కలదని, ఆమె తమ హానీమూన్ క్యాన్సిల్ అయినా దానికి గొడవ పడలేదని,ఆమె అతని కెరీర్ గురించి ఆలోచించి అర్దం చేసుకుందని చెప్తున్నాడు. ఇక తనకు పెళ్ళి పనుల్లో అల్లు అర్జున్ హెల్ప్ చేస్తానని మాట ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బన్నీ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. అక్కడనుంచి రాగానే త్రివిక్రమ్ అతని సినిమా ప్రారంభం కానుంది. డివివి దానయ్య నిర్మించే ఈ చిత్రం లవ్ ఎంటర్టైనర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. ఈ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో "హనీ" అన్న పేరుని రిజిస్టర్ చేశారు. ఈ "హనీ" చిత్రానికి క్యాప్షన్ గా "హి ఈజ్ వెరీ స్వీట్" అని పెట్టడం జరిగిందని చెప్తున్నారు. ఈ "హనీ" చిత్రంలో ఇలియానా కానీ, సమంత కానీ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. ఆగస్టు నెలలో ప్రారంభం కాబోయే ఈ చిత్రానికి సంగీతం దేవీశ్రీ ప్రసాద్ అందించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X