వీడియో: నాగబాబు సందేహం.. క్యాప్ ట్రిక్, బన్నీ టాలెంట్‌కి ఇదే సాక్ష్యం, రెండు నెలల్లోనే!
అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. బన్నీ ఆర్మీ అధికారిగా నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వక్కంతం వంశి తొలి సారి దర్శకత్వం వహిస్తున్నప్పటికీ కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో నాపేరు సూర్య చిత్రాన్ని యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించినట్లు తెలుస్తోంది. పాటలు, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మే 4 నాపేరు సూర్య చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. లవర్ ఆల్సో, ఫైటర్ ఆల్సో అనే సాంగ్ లో బన్నీ ప్లే చేసిన క్యాప్ ట్రిక్ కూడా అభిమానులని తెగ ఆకర్షిస్తోంది.

దేశభక్తి నేపథ్యంలో
ఈ చిత్రంలో అల్లు అర్జున్ యాంగ్రీ సోల్జర్ గా కనిపించబోతున్నాడు. పూర్తి స్థాయి దేశభక్తి కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. అల్లు అర్జున్ గెటప్, హావభావాలు అభిమానులని తెగ ఆకర్షిస్తున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న బన్నీ ఈ చిత్రంతో కూడా సక్సెస్ ని కొనసాగిస్తాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

నాగబాబు అడిగిన డౌట్
నాపేరు సూర్య చిత్రానికి మెగా బ్రదర్ నాగబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో నాగబాబు బన్నీని అడిగిన ఓ సందేశం చర్చనీయాంశంగా మారింది. లవర్ ఆల్సో, ఫైటర్ ఆల్సో అనే సాంగ్ లో బన్నీ ప్లే చేసిన క్యాప్ ట్రిక్ అందర్నీ ఆకర్షించింది. నిజంగానే చేసావా లేక ఏమైనా ట్రిక్ ఉపయోగించారా అని నాగబాబు బన్నీని అడగడంతో చర్చనీయాంశంగా మారింది.

దర్శకుడి సమాధానం
నాగబాబు అడిగిన ప్రశ్నకు చిత్ర దర్శకుడు వక్కంతం వంశి సమాధానం ఇచ్చాడు. అది ట్రిక్ కాదని, బన్నీ నిజంగానే నేర్చుకుని చేసారని వంశి వివరణ ఇచ్చాడు. అప్పటి నుంచి బన్నీ చేసిన క్యాప్ మూమెంట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచేసింది.
బన్నీ టాలెంట్‌కి సాక్ష్యం
అల్లు అర్జున్ చాలా కష్టమైన డాన్స్ మూమెంట్స్ ని కూడా చాలా సులువుగా చేయగలడు. ఇండియాలో ఉన్నా బెస్ట్ డాన్సర్లలో బన్నీ కూడా ఒకడని అంతా ప్రశంసిస్తారు. బన్నీ ప్లే చేసిన క్యాప్ మూమెంట్ కి సంబంధించిన మేకింగ్ వీడియోని తాజగా విడుదల చేశారు. క్యాప్ మూమెంట్ ని బన్నీ సాధన చేస్తున్న వీడియో ఇది.

రెండు నెలల్లోనే
ఇలాంటి మూమెంట్ ప్లే చేయాలంటే కనీసం ఏడాది ట్రైనింగ్ అవసరం అని ఈ వీడియో లో చిత్ర యూనిట్ పేర్కొంది. కానీ అల్లు అర్జున్ కేవలం రెండు నెలల్లోనే ట్రైనింగ్ ఫినిష్ చేసి ఫస్ట్ టేక్ లోనే పక్కాగా చేసి చూపించారని అన్నారు.


Click it and Unblock the Notifications











