ఓ సినిమా ఒప్పుకునే ముందు... : అల్లు అర్జున్
హైదరాబాద్: ఆర్టిస్టుగా నన్ను నేను సంతృప్తిపరచుకొంటూనే నిర్మాతల్ని సంతోషపెట్టాలనుకొంటాను. అందుకే ఓ సినిమా ఒప్పుకొనే ముందు హీరోగానే కాకుండా నిర్మాతగానూ ఆలోచిస్తాను అన్నారు అల్లు అర్జున్. సోమవారం ఆయన జన్మదినం. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. ఈ పుట్టిన రోజుని ఆయన హైదరాబాద్ లో భార్య,కుటుంబ సభ్యులతో జరుపుకోనున్నారు.
అలాగే..నిర్మాత కొడుకుని కావడంతో నాకది అలవాటైందేమో. యువతరం, కుటుంబ ప్రేక్షకులు, అభిమానులు... ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించడమే లక్ష్యంగా కథల్ని ఎంచుకొంటాను అని చెప్పుకొచ్చాడు బన్ని. 'గంగోత్రి'తో మొదలైన బన్నీ సినీ ప్రయాణానికి ఇటీవలే పదేళ్లు పూర్తయ్యాయి. ''ఈ ప్రయాణంలో నేను ఎన్నో కొత్త విషయాల్ని నేర్చుకొన్నాను. దర్శకులు ఒక్కొక్కరు ఒక్కో తరహాలో నన్ను తెరపై చూపించారు. ఇకపై మరిన్ని విభిన్నమైన పాత్రల్లో నటించాలని ఉంది''అన్నారు.
అల్లు అర్జున్ తన జన్మదినోత్సవ వేడుకల్లో 'ఇద్దరమ్మాయిలతో..' చిందేయడానికి రెడీ అవుతున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో... పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్ర పాటలను ఈ నెల మూడో వారంలో విడుదల చేసేందుకు నిర్మాత బండ్ల గణేష్ సన్నాహాలు చేస్తున్నాడు. బాద్‌షా హిట్‌తో మంచి దూకుడు మీదున్న గణేష్.. ఇప్పుడు ఈ చిత్రంపై దృష్టి సారించాడు.
ఈ నెల 8న అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా.. ఇద్దరమ్మాయిలతో ప్రచార చిత్రాలను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో అర్జున్ సరసన అమలాపాల్, కేథరిన్ హీరోయిన్లుగా నటించగా.. బ్రహ్మనందం, నాజర్ కీలక పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











