నిజం తెలుసుకోండి? అల్లు అర్జున్!
అల్లు అర్జున్, కాజల్, నవదీప్ హీరో హీరోయిన్లుగా నటించి రీసెంట్ గా విడుదలైన చిత్రం ఆర్య 2. ఇప్పుడున్న హీరోల్లో అత్యంత చురుకుగా, మంచి ఎనర్జీతో, డాన్స్ ల్లో వైవిధ్యభరితంగా యాక్ట్ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. అల్లు అర్జున్ కు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ అయ్యి, తను ఏమి అడిగినా ఇవ్వడానికి సిద్దం అవుతున్నారని ప్రముఖుల సమాచారం. అంత ఇమేజ్ ను సంపాదించుకున్న అల్లు అర్జున్ రీసెంట్గా విడుదలైన ఆర్య 2 గురించి వస్తున్న కామెంట్స్ పై తీవ్రంగా స్పందిచాడు.
'ఆర్య 2" చిత్రం సక్సెస్ ఫుల్ గా నడుస్తుంటే కొందరు పనిగట్టుకుని ఫ్లాప్ అని ప్రచారం చేస్తున్నారు. తన సినిమా రిలీజైన ప్రతిచోట విజయఢంకా మోగిస్తుంటే...ఇదేం చోద్యం...ఇదంతా మా కుటుంబం మీద ద్వేషంతో చేస్తున్నారు అంటున్నాడు. ఇటువంటి రూమర్లు మా మామయ్య చిరు మీద ఉన్న కోపంతో పనిగట్టుకుని సినిమా మీద బురద చల్లుతున్నారు. కానీ సినిమాలో దమ్ముంది..దాన్ని ఎవరూ ఆపలేరు. ఛాలెంజ్ అంటున్నాడు అల్లు అర్జున్.
అలా అయితే మెన్న విడుదలైన తెలుగు చలనచిత్రం చరిత్రలను తిరగరాసిన రామ్ చరణ్ చిత్రం 'మగధీర"పై ఎందుకు బురద చల్లలేదో ఒక్కసారి ఆలోచించు కోవాలి, నిజంగా చిరుపై కోపం ఉంటే ఆ సినిమా అంత విజయం సాధించి ఉండేదా ? ఒక్క సారి మనస్సుతో ఆలోచించు అంటున్నారు పరిశ్రమలోని పెద్దలు.


Click it and Unblock the Notifications











