మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్ ఈవెంట్.. అక్కినేని అఖిల్ కోసం రాబోతున్న స్టార్ హీరో

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అతి కొద్దిమంది స్టార్ హీరోలలో అక్కినేని అఖిల్ కూడా ఉన్నాడు. ఇక మొత్తానికి ఈ హీరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయితే అందుకున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అసలు ఈ సినిమా విడుదల ముందు వరకు కూడా పెద్దగా హైప్ అయితే క్రియేట్ చేయలేదు. అయితే పండగ సీజన్ లో ఇతర సినిమాల నుంచి పెద్దగా పోటీ లేకపోవడం వలన అఖిల్ సినిమాకు బాగా కలిసి వచ్చింది. మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వచ్చేసింది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు అయితే అందుకోవడంతో అక్కినేని అఖిల్ ఆల్మోస్ట్ హిట్టు కొట్టినట్లే అనే టాక్ కూడా వస్తోంది.

అక్కినేని కుటుంబంలో అఖిల్ ఒక్కడే సరైన విజయం అందుకోలేదు అని ఇన్నాళ్ళ నుంచి అభిమానులు కూడా కాస్త నిరుత్సాహంతోనే ఉన్నారు. మొదటి సినిమా అఖిల్ నుంచి హలో, మిస్టర్ మజ్ను సినిమాల వరకు బాక్సాఫీస్ వద్ద పెద్దగా లాభాలను అందించలేదు. అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మాత్రం అఖిల్ ఒక్కసారిగా తన కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు. అసలు ఈ సినిమా గత ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూనే ఉంది. పలు ఓటీటీ ఆఫర్స్ వచ్చినా కూడా అఖిల్ కెరీర్ దృష్ట్యా సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేయాలని నిర్మాత అల్లు అరవింద్ నిర్ణయం తీసుకున్నాడు. మొత్తానికి అనుకున్నట్లుగానే భారీగా థియేటర్స్ లో విడుదల చేశారు.

Allu arjun Chief guest for Most Eligible Bachelor movie success event,

సినిమా సక్సెస్ అవ్వడం తో అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక అక్కినేని నాగార్జున కూడా కొడుకు మొదటి సక్సెస్ చూడడంతో ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇక ఈ సక్సెస్ ను భారీగా సెలబ్రేట్ చేసుకోవాలని చిత్ర నిర్మాతలు కూడా సక్సెస్ వేడుక నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అల్లు అర్జున్ అఖిల్ సినిమాలకు సంబంధించిన వేడుకల్లో అయితే పెద్దగా పాల్గొనలేదు. అయితే పర్సనల్ గా మాత్రం ఇద్దరూ మంచి స్నేహితులు అనే చెప్పాలి. ఎక్కువగా అఖిల్ బన్నీ ఇద్దరు కూడా పార్టీలలో పాల్గొంటూనే ఉంటారు.

ఇక ఇప్పుడు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా సక్సెస్ అందుకోవడంతో అల్లుఅర్జున్ ప్రత్యేకంగా అభినందించడానికి వేడుకకు రాబోతున్నాడు. అక్టోబర్ 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఫిలింనగర్లోని జె ఆర్ సి కన్వెన్షన్ లో ఈ వేడుకను నిర్వహించబోతున్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ తదుపరి సినిమాల విషయానికి వస్తే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X