ప్రియా వారియర్ ‘లవర్స్ డే’కు చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్... 23న క్రేజీ ఈవెంట్!
Recommended Video

మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ తన మొదటి చిత్రం ఒరు ఆడార్ లవ్ చిత్రం ద్వారా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఓవర్ నైట్‌లో కోటి రూపాయల పారితోషికం అందుకొనే స్థాయికి ఎదిగిపోయింది. ఏకంగా ఆమె కోసం బాలీవుడ్, టాలీవుడ్ నిర్మాతలు కూడా క్యూ కడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాంటి క్రేజ్‌తో దూసుకెళ్తున్న ప్రియా వారియర్ తెలుగు ప్రేక్షకులకు చేరువ కాబోతున్నది. వివరాల్లోకి వెళితే..

ప్రియా వారియర్ క్రేజ్ ఇలా
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఒరు ఆడార్ లవ్ చిత్రంలో కొంటేగా కంటి సైగతో మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. యూత్‌కు గిలిగింతలు పెట్టే ప్రేమ కథా చిత్రంతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకొన్నది. అంతేకాకుండా 2018లో గూగుల్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఒకరిగా ఓ ఘనతను సాధించింది. `ఒరు ఆడార్ లవ్`లో కేవలం 27 సెకన్ల పాటు ఆమె చేసిన కనుసైగకు రెండు రోజుల్లోనే 45 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇప్పటికి రెండు కోట్ల మంది ఆ వీడియో చూశారు.

ఫిబ్రవరి 14న లవర్స్ డే రిలీజ్
ఇటీవల యూత్‌ను విశేషంగా ఆకట్టుకొన్న ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన ఒరు ఆడార్ లవ్ చిత్రం తెలుగులో ‘లవర్స్ డే' పేరుతో విడుదలకు సిద్ధమైంది. మలయాళంలో క్రేజీ డైరెక్టర్ ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాతలు ఎ. గురురాజ్, సి.హెచ్.వినోద్‌రెడ్డి సుఖీభవ సినిమాస్ బ్యానర్‌పై ప్రేమికుల దినం రోజు అంటే ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
23న ఆడియోకు అల్లు అర్జున్ హాజరు
ఇప్పటికే లవర్స్ డే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. ప్రచార కార్యక్రమంలో భాగంగా లవర్స్ డే సినిమా ఆడియో రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జనవరి 23న వైభవంగా నిర్వహించేందుకు నిర్మాతలు గురురాజ్, వినోద్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. బన్నీ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరవుతున్నారనే విషయం సినీవర్గాల్లో మరింత అంచనాలు పెంచింది.

హీరో బన్నీకి థ్యాంక్స్
లవర్స్ డే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ఆహ్వానించిన వెంటనే అల్లు అర్జున్ మా కోరికను మన్నించి ఒప్పుకొన్నారు. ఆయన రానుండటంతో మా సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది. మా ఆహ్వానాన్ని సహృదయంతో అంగీకరించిన అల్లు అర్జున్‌కు మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నామని నిర్మాతలు గురురాజ్, వినోద్ రెడ్డి తెలిపారు.

నటీనటులు, సాంకేతికవర్గం
నటీనటులు: నూరిన్ షెరిఫ్, రోషన్, మాథ్యూ జోసఫ్, వైశాఖ్ పవనన్, మైఖేల్ యాన్ డేనియల్, దిల్‌రూపా, హరీష్ పెరుమన్న, అనీష్ జి మీనన్, షాన్ సాయి, అర్జున్ హరికుమార్, అతుల్ గోపాల్, రోష్న అన్‌రాయ్ తదితరులు.సాంకేతిక నిపుణులు
:
కెమెరా : శీను సిద్ధార్థ్
ఎడిటింగ్: అచ్చు విజయన్
సంగీతం: షాన్ రెహమాన్
స్క్రీన్‌ప్లే: సారంగ్ జయప్రకాష్, లిజో పనాడా
కథ, దర్శకత్వం: ఒమర్ లులు
నిర్మాతలు: ఎ. గురురాజ్, సి.హెచ్.వినోద్‌రెడ్డి


Click it and Unblock the Notifications











