'బద్రినాథ్' టాక్ అందుకే తేడా వచ్చింది...అల్లు అర్జున్ వివరణ
"ముందు ఈ సినిమా ఫలితం గురించి పలు రకాలుగా మాట్లాడుకొన్నారు. అంచనాలు పెంచుకొని రావడమే అందుకు కారణం కావచ్చు. అయితే ఇప్పుడొస్తున్న వసూళ్లు చూస్తుంటే సంతృప్తిగా ఉంది" అంటూ అల్లు అర్జున్ తన తాజా చిత్రం 'బద్రినాథ్' గురించి చెప్పుకొచ్చారు. అలాగే తమిళంలో విడుదల చేయాలనుకోవటానకి కారణం చెప్తూ...''తమిళంలోనూ మార్కెట్‌ని విస్తరించాలనే ఆలోచన ఉంది. దాని వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. సినిమా పెట్టుబడి పెంచాల్సిన విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉండదు. పైగా పారితోషికం కూడా ఎక్కువే వస్తుందని అన్నారు.
అలాగే మగధీర ప్రభావం తెలుగు సినీ పరిశ్రమ మీద చాలా ఉంది. డబ్బు ఖర్చుపెడితే... తిరిగి సంపాదించుకోవచ్చు అనే ధీమా ఇచ్చింది ఆ సినిమానే. బద్రినాథ్ చేస్తున్నప్పుడు మా మదిలో కూడా అదే మెదిలింది. అంటే... అలాంటి సినిమా తీయాలని కాదు. ఖర్చు పెట్టినా తిరిగి వస్తుందనే నమ్మకాన్ని పెంచుకొన్నాం. ప్రేక్షకులకు కావల్సిన అన్ని అంశాలూ ఓ సినిమాలో మేళవిస్తే పెట్టుబడి తిరిగి రావడానికి ఢోకా ఉండదు అని తెల్చి చెప్పారు.


Click it and Unblock the Notifications











