మరోసారి హరీష్ శంకర్ తో జట్టుకట్టిన బన్నీ.. ఈసారి కూడా అందుకే!
పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ ఒక్క సారిగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనతో బ్రాండ్లు కొలాబరేట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆయనను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంటే తమ బ్రాండ్ కి మరింత క్రేజ్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో పలు బ్రాండ్లు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మరో బ్రాండ్ కి సంబంధించిన యాడ్ ఫిలిం షూటింగ్లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

స్మగ్లర్ స్థాయికి
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. అనసూయ, సునీల్ వంటి వారి కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా శేషాచలం అడవుల నేపథ్యంలోని ఎర్రచందనం స్మగ్లింగ్ అనే కాన్సెప్ట్ మీద తెరకెక్కించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక కూలీ స్థాయి నుంచి స్మగ్లర్ స్థాయికి ఎదిగిన వ్యక్తిగా కనిపించాడు.

అంబాసిడర్ గా
మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగాన్ని మరింత భారీ బడ్జెట్ తో నార్త్ ప్రేక్షకులు మరింత కనెక్ట్ అయ్యే విధంగా రూపొందించడానికి ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు. అయితే పుష్ప సినిమాతో ఏర్పడిన క్రేజ్ దృష్ట్యా అల్లు అర్జున్ కి నార్త్ సాహ సౌత్ లో పలు బ్రాండ్స్ తమ అంబాసిడర్ గా నియమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికి ఆయన జొమాటో, రెడ్ బస్, రాపిడో వంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్
అలాగే తాజాగా ఆయన ఆస్ట్రల్న్నారు. తాజా పైప్ సంస్థకి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడానికి ఒప్పుకుగా దానికి సంబంధించిన యాడ్ ఫిలిం షూటింగ్ హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. ఈ యాడ్ ఫిలింకు హరీష్ శంకర్ దర్శకత్వ వహించారు. అలాగే వరల్డ్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్ సుదీప్ చటర్జీ కెమెరా బాధ్యతలు చూస్తున్నారు.

కోక్ బ్రాండ్ కి
ఇక ఈ యాడ్ ఫిలిం షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు అలాగే కొన్ని వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు వాటన్నింటినీ సోషల్ మీడియాలో మరింత వైరల్ చేస్తున్నారు. నిజానికి అల్లు అర్జున్ గత కొద్దిరోజుల క్రితమే హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో యాడ్ ఫిలిం కూడా చేశారు. థాయిలాండ్ లో కోక్ బ్రాండ్ కి సంబంధించి ఒక యాడ్ ఫిలిం చేయగా అది ఇప్పటికే ప్రసారానికి కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

సిద్ధం కాలేదని
గతంలో హరీష్ శంకర్, అల్లు అర్జున్ కలిసి డీజే దువ్వాడ జగన్నాథం అనే సినిమా చేశారు. ఈ సినిమాతో బన్నీ మంచి హిట్ అందుకున్నారు. ఇక ప్రస్తుతానికి బన్నీ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆయన సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సీక్వెల్ చేయాల్సి ఉంది. ఈ సినిమా కథ ఇంకా సిద్ధం కాలేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి సుకుమార్ ఈ సినిమా కథ సిద్ధం చేసే పనిలో బిజీ బిజీగా గడుపుతున్నారు.


Click it and Unblock the Notifications











