నిహారిక పెళ్లిలో అల్లు స్నేహా సందడి.. భార్యపై అలాంటి కామెంట్.. బన్నీ మామూలోడు కాదు
మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఎప్పటిలానే మెగా ఈవెంట్‌లో అల్లు ఫ్యామిలీ రచ్చ చేస్తోంది. మెగా పార్టీల్లో అల్లు బ్రాండ్ అన్నది ఎప్పటి నుంచో వస్తూనే ఉంది. మెగా ఫ్యామిలీలో ఎలాంటి పార్టీలు జరిగినా అక్కడ అల్లు వారి ముద్ర కనిపిస్తుంది. నిహారిక నిశ్చితార్థపు వేడుకల్లో అయితే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి క్రియేట్ చేసిన సెన్సేషన్‌కు సోషల్ మీడియా షేక్ అయింది. ఇప్పుడు కూడా ఈ జంటే వైరల్ అవుతోంది.

నిన్నమో అలా..
నిహారిక పెళ్లి వేడుకల్లో భాగంగా నిన్న అందరూ స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్లారు. అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఫ్యామిలీ కలిసి ఒకే ఫ్లైట్‌లో వెళ్లారు. అయితే ఫ్లైట్‌లో అర్హ, అయాన్‌లు చేసిన అల్లరి ఒకెత్తు అయింది. అల్లు స్నేహారెడ్డి ఫోటోను షేర్ చేస్తూ బన్నీ చేసిన కామెంట్ మరొ ఎత్తు అయింది.

క్యూట్ అంటూ..
అల్లు వారి దీపమంటూ అర్హ ఫోటోను షేర్ చేసిన బన్నీ.. అల్లు స్నేహారెడ్డి కోపంగా అలకతో ఉన్నట్టుఏదో ఆలోచిస్తున్న ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటో ఎంత వైరల్ అయిందో బన్నీ పెట్టినకామెంట్ కూడా అంతే వైరల్ అయింది. తన శ్రీమతి ఇచ్చిన పోజు క్యూట్ అంటూ బన్నీ ప్రశంసించాడు.

ఈవెంట్‌లో అలా..
నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్‌లో అల్లు బ్రదర్స్ హవా నడుస్తోంది. సంగీత్ ఈవెంట్‌లోనూ అల్లు వారు రచ్చ చేసినట్టు కనిపిస్తోంది. ముగ్గురు అల్లు సోదరులు ఒకే చోట ఉంటూ తమ ఐక్యతను చాటారు. అలా ముగ్గురు పోజివ్వడంతో ఆ ఫోటోలు బాగానే వైరల్అయ్యాయి.

తాజాగా భార్యపై..
తాజాగా బన్నీ మరోసారి తన శ్రీమతిపై ప్రేమను చాటుకున్నాడు. అమిత్ అగర్వాల్ డిజైన్ చేసిన దుస్తులను స్నేహా ధరించింది. హర్మన్ కౌర్ స్పెషల్‌గా రెడీ చేసిన స్నేహా ఫోటోను బన్నీ షేర్ చేశాడు. షేర్ చేయడం వరకు ఓకే గానీ హాట్ అంటూ కామెంట్ పెట్టాడు. బన్నీ ఇలాంటి కామెంట్ పెడతాడనిఎవ్వరూ ఊహించి ఉండరు.
Recommended Video

పెళ్లి వేడుకల్లో..
నిహారిక పెళ్లి వేడుకల్లో అభిమానులకు ఓ వెలితి కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్, ఆయన ఫ్యామిలీ గానీ లేకపోవడంతో ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ పెళ్లికి వస్తాడా? అని ఫ్యాన్స్ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు.


Click it and Unblock the Notifications











