ఇన్నాళ్ళు తాను రాజకీయాలు మాట్లాడేంత పెద్దవాడిని కానంటూ వచ్చిన బన్నీ ఇప్పుడు ప్రచారంలోకి దూకి చెలరేగిపోతున్నారు. తన మామనే వెన్నుపోటు పొడిచిన వాడికి బంధాలు..అనుబంధాలుకు విలువనిచ్చే మామయ్య చిరంజీవిని అనే హక్కులేదంటూ ఘూటైన విమర్శనాస్త్రాలు సంధించాడు. అలాగే మామయ్య చిరంజీవిని తన తాతగారు అప్పట్లో రాజకీయాల్లోకి రమ్మనేవారని...అయితే అందుకు ఆయన ఒప్పుకోకుండా నవ్వి దాటేసేవారన్నారు. అయితే పోటీ చేస్తే కనుక మీ ఊరు పాలకొల్లు నుంచే చేస్తాననే వారని అది ఇప్పుడు నెరవేస్తున్నారని చెప్పాడు. అలా లేని మామగారు కిచ్చిన మాట కోసం చిరంజీవి పాలకొల్లు నుంచి పోటీ చేస్తుంటే..చంద్రబాబు బ్రతికున్న మామగారికే వెన్నుపోటు పొడిచి క్షోభ కల్గించిందన్నారు. అలాగే దమ్ము, సత్తా గురించే మాట్లాడే బాబు కూటమెందుకు కట్టాల్సి వచ్చిందని విమర్శించారు. అలాంటి బాబుకి చిరంజీవి దమ్ము, సామర్ద్యం గురంచి మాట్లాడకూడదన్నాడు.