పదేళ్ల ‘వేదం’.. అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్
కొన్ని సినిమాలు కాసుల వర్షం కురిపించకపోవచ్చు. కమర్షియల్ హిట్ కాకపోవచ్చు. కానీ వారి సినీ కెరీర్‌లోనే నిలిచిపోయే చిత్రాలు కొన్ని ఉంటాయి. అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క వంటి వారి సినీ జీవితంలో వేదం సినిమా కూడా అలాంటిదే. అందరి కంటే మరీ ముఖ్యంగా అప్పటికే స్టార్ స్టేటస్ ఉన్న బన్నీ కేబుల్ రాజు వంటి అతి సాధారణమైన పాత్రను పోషించడం. వేదం సినిమా ఎన్నో సత్యాలను చాటి చెబుతుంది.
దర్శకుడు క్రిష్ ఆవిష్కరించిన అద్భుత కావ్యం వేదం. ఈ చిత్రం విడదలై నేటి దశాబ్దం కావోస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ వేదం గురించి నెటిజన్లు ప్రస్థావిస్తున్నారు. ఒక రోజులో జరిగే కథ, నాలుగు విభిన్న పాత్రలు ఇలా ఆసాంతం ఆసక్తిగా సాగే చిత్రం అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చివరకు ఇచ్చిన ముగింపు కాస్త అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ చిత్రంలో కీరవాణి అందించిన సంగీతం కూడా ఓ అద్బుతమే. ఈ మూవీకి పదేళ్లు పూర్తి కావడంతో అల్లు అర్జున్ కాస్త ఎమోషనల్ అయ్యాడు.

ఈ మేరకు వేదంపై బన్నీ ఓ ట్వీట్ వేశాడు. 'వేదం చిత్రానికి దశాబ్దం.. ఈ అద్భుతమైన ప్రయాణంలో పాలుపంచుకున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. దర్శకుడు క్రిష్ విజన్, ప్యాషన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. మంచు మనోజ్, అనుష్క, మనోజ్ బాజ్‌పేయ్, మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా కీరవాణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా మీద నమ్మకం ఉంచినందుకు ఆర్కా మీడియా వారికి ధన్యవాదాల'ని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











