»   » మెగా క్యాంపు రాజకీయం: ఆలోచనలో పడ్డ అల్లు అర్జున్!

మెగా క్యాంపు రాజకీయం: ఆలోచనలో పడ్డ అల్లు అర్జున్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా హీరోస్ మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తున్న‌ట్టు, అల్లు అర్జున్ మెగా గొడుగు కింద నుండి పక్కకు తప్పుకుని తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నంలో ఉనప్నట్లు వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ విషయం బయట రచ్చరచ్చ కావడంతో అల్లు అర్జున్ ఆలోచనలో పడ్డాడట.

ఇటీవ‌ల కుమార్ 21 ఎఫ్ సినిమా ఆడియో వేడుకకు బ‌న్ని ముఖ్యఅతిధిగా హాజ‌ర‌యిన విష‌యం తెలిసిందే. ఈ ఆడియో వేడుక‌లో పాల్గొనేందుకు వ‌చ్చిన ఫ్యాన్స్ బ‌న్ని క‌ల‌సార‌ట. మెగా హీరోస్ అంతా ఒక‌టే అని చెప్పాడ‌ట‌. అలాగే మెగా ఫ్యామిలీ హీరోల సినిమా రిలీజ్ స‌మ‌యంలో బ్యాన‌ర్స్ లో మెగా హీరోల అంద‌రి ఫోటోలు ఉండాలా చూడాల‌ని..ముఖ్యంగా చిరంజీవి గారి ఫోటో ఖ‌చ్చితంగా ఉండాల‌ని చెప్పాడ‌ట బ‌న్ని.

Allu Arjun comments on Mega heroes cold war

అసలు ఏం జరిగింది?
హీరోగా కెరీర్లో ఒక్కో మెట్టు ఎక్కుతున్న అల్లు అర్జున్.....క్రమక్రమంగా మెగా ఫ్యామిలీతో వీలైనంత డిస్టెన్స్ మెయింటేన్ చేస్తున్నాడని అంటున్నారు. మెగా గొడుగు కిందే ఉండిపోకుండా తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాడట. మీడియాలో, అభిమానుల్లో ఇపుడు ఈ విషయం హాట్ టాపిక్ అయింది. ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ వ్యవహార శైలి అలానే ఉందని అంటున్నా కొందరు సీనియర్ మెగా ఫ్యాన్స్.

ఇటీవల కాలంలో అల్లు అర్జున్ చిరంజీవి బ్లడ్ బ్యాంకును సందర్శించడం, ఇక్కడ జరిగే మెగా అభిమానుల సమావేశాలకు, ఇతర కార్యక్రమాలకు హాజరవ్వడం మానేసాడు. తన అభిమానులతో మీటింగ్స్, ఇతర కార్యక్రమాలకు గీతా ఆర్ట్స్ ఆఫీసునే వేదిక చేసుకుంటున్నాడట. ఒకప్పుడు మెగా అభిమానులే తన మెయిన్ సపోర్టింగ్ సిస్టమ్ గా భావించిన బన్నీ...ఇపుడు వారితో అసలు టచ్ లో ఉండటం లేదట.

ఈ మధ్య అల్లు అర్జున్ పిఆర్ టీం...ఆయన సినిమాలకు సంబంధించిన ఆడియో వేడుకలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన ఏవి(ఆడియో విజువల్స్)లలో చిరంజీవి పేరును కూడా ప్రస్తావించడం లేదని కొందరు మెగా అభిమానులు గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

English summary
Allu Arjun comments on Mega heroes cold war.
Please Wait while comments are loading...