నడవలేని స్థితిలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కు స్క్రిప్టు ఇచ్చి వారికి కావలసినట్లు మాట్లాడించటం సరికాదని అల్లు అర్జున్ అన్నారు. ప్రమాదకరంగా గాయపడి మంచంమీద ఉన్న వ్యక్తి ప్రచారం అవసరమైందంటే మహాకూటమికి ఏమాత్రం బలం ఉందో అర్థమవుతుందని అర్జున్, రాంచరణ్ తేజలు విమర్శించారు. నెల్లూరు జిల్లా కోవూరులో పీఆర్పీ అసెంబ్లీ అభ్యర్థి మునెమ్మకు మద్దతుగా వారు ప్రచారం చేస్తూ ఈ కామెంట్స్ చేసారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పై విమర్శనాస్త్రాలు సంధించారు.టీడీపీ చేసే ఎన్నికల వాగ్థానాలు ఆచరణ యోగ్యం కాదన్నారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం కొనసాగించలేని వ్యక్తి నెలకు రెండు వేలు ఇస్తానంటే ప్రజలు ఎలా నమ్ముతారని వారు అన్నారు. నగదు బదిలీ పథకాన్ని కూడా కొన్నాళ్లు ఇచ్చి ఆర్థికస్థితి కుంటుపడిందంటూ ఎత్తేయటం ఖాయమన్నారు.
Story first published: Tuesday, April 21, 2009, 15:34 [IST]