Allu Arjun మంగళవారం ఈవెంట్‌లో గంగమ్మ జాతర.. పుష్ప 2 బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చిన బన్నీ

ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా అజయ్ భూపతి ఇండస్ట్రీకి పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఇక ఇదే సినిమాతో హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ఈ సినిమా తర్వాత మరోసారి వీరి ఇద్దరి కాంబోలో వస్తున్న చిత్రం మంగళవారం. ఈ సినిమాలో మరోసారి పాయల్ రాజ్ పుత్ బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయింది. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధం కాగా.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఇక ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ వేడుకలో పాల్గొన్న అల్లు అర్జున్.. సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే....

అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ కాంబోలో వస్తున్న చిత్రం 'మంగళవారం'. ఈ సినిమా టైటిల్‍తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండగా... ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అథిగా వచ్చారు. ఆయన సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Allu Arjun Comments on Payal Rajput Mangalavaram Movie and Pushpa 2 Update

అల్లు అర్జున్ మాట్లాడుతూ.... అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి స్టార్ట్ అవ్వడమే బ్లాస్ట్ స్టార్ట్ అయింది. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. మంగళవారం సినిమా అందరి మనసులకు నచ్చుతుంది. ఎందుకంటే ఈ సినిమా టీజర్ చూశా.. నేను షాకయ్యాను. మంగళవారం సినిమా చూడాలి అనిపించింది. అజయ్ గర్వించే విధంగా సినిమా తీశాడు. అజయ్ గారి ఆర్ఎక్స్ 100 సినిమా అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో పిల్లా రా సాంగ్ ఇంకా నడుస్తూనే ఉంటుంది.

పుష్ప సినిమా షూటింగ్ చేస్తుండగా.. సుకుమార్ వచ్చి మంగళవారం సినిమాకు ఛీఫ్ గెస్టుగా వెళ్తున్నారా అని అడిగారు. అవును అన్నాను. ఇక సుకుమార్ గారికి మంగళవారం సినిమా టీజర్ చూపించాను. ఆయన వెంటనే షాక్ అయ్యారు. బాగుందని తెలిపారు. ఆ సినిమాలో వైబ్ ఉంది.. చాలా మందికి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాకు అందరూ కష్టపడి పని చేశారు. ప్రతి ఒక్క ఆర్టిస్టుకు ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా పాయల్ కి ఆల్ ది బెస్ట్. మీకు ఇది మైల్ స్టోన్ సినిమా అవుతుంది. ఈ సినిమా కథ అజయ్ చెప్పినప్పుడు ఈ సినిమా ఒక బోల్డ్ విషయం ఉంటుంది. చాలా ధైర్యం కావాలి ఈ సినిమా తీయాలంటే.. టీజర్ ట్రైలర్ చూసినప్పుడు చాలా బాగా తీశాడు అనిపించింది.

నేను లైఫ్ లో చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. మన సక్సెస్ ను వాళ్ల సక్సెస్ లాగా ఫీల్ అవుతారు. అలా ఉండేది స్వాతి ప్రణవ్. ఇది మా సొంత సినిమాలాగా.. ఈ సినిమా కూడా అంతే. ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఈవెంటుకు రావడం సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ స్వాతి. ఇక ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే.. ఆయన అంటే మాకు గౌరవం. మీరు ఎంతో మందికి స్ఫూర్తి. మా ఫ్రెండ్ స్వాతి రెండేళ్ల క్రితం వచ్చి.. ఈ సినిమా గురించి చెప్పింది. నాకు తెలియని ఫీల్డ్ అని చెప్పుకువచ్చింది. మనం ఏదైనా చెద్దాం అనుకున్నప్పుడు చేయాల్సిందే అని చెప్పాను. నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పినా కూడా తనే స్వతహాగా అన్ని చేసుకువచ్చింది.

Allu Arjun Comments on Payal Rajput Mangalavaram Movie and Pushpa 2 Update

మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మన పక్కన మంచి పార్ట్ నర్ ఉండాలి. అది మ్యారేజ్ అయినా.. బిజినెస్ అయినా.. స్వాతి నీకు ఆల్ ది బెస్ట్. పుష్ప షూటింగ్ నుంచే వచ్చాను రామోజీ ఫిల్మ్ సిటీ నుంచే వచ్చాను. జాతర ఎపిసోడ్ షూట్ చేస్తున్నాం.. మీకు నచ్చుద్ది అని చూస్తున్నా... నెక్ట్స్ ఆగస్టు 15 రిలీజ్ అవుద్ది దాని గురించి నెక్ట్స్ వేడుకలో మాట్లాడుకుందాం. మంగళవారం సినిమా ఈ శుక్రవారం సినిమా వస్తుంది.. పుష్ప 2 అస్సలు తగ్గేదేలే ... నా ఆర్మికి థ్యాంక్స్.. అంటూ చెప్పుకువచ్చారు.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే... అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. పాయల్ రాజ్ కీలక పాత్రలో నటించింది. మంగళవారం సినిమాలో పాయల్ రాజ్‍పుత్ తో పాటు.. నందితా శ్వేత, దివ్యా పిళ్లై, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోశ్ శ్రవణ్ రెడ్డి కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమా నవంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం భాషల్లోనూ ఏక కాలంలో పాన్ ఇండియా రేంజులో రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X