స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 10
హైదరాబాద్: స్టైలిష్ స్టార్‌గా, సక్సెస్ ఫుల్ హీరోగా టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచిన అల్లు అర్జున్ నేటితో ఇండస్ట్రీలోకి అడగు పెట్టి 10 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. హాస్య నటుడు అల్లు రామలింగయ్య మనవడిగా, నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా.... వారసత్వం ఉండటంతో బన్నీ ఎంట్రీ చాలా సులభంగానే జరిగింది. తొలి చిత్రం 'గంగోత్రి' రాఘవేంద్రరావు లాంటి పెద్ద దర్శకుడితో చేయడంతో తొలి సినిమాతోనే హిట్ కొట్టాడు బన్నీ. ఈ చిత్రం మార్చి 28, 2003లో విడులైంది.
గంగోత్రి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైనా తనతైన టాలెంట్ తో స్టైలిష్ స్టార్‌గా ఎదిగాడు బన్నీ. ఆర్య చిత్రంతో ఫీల్ మై లవ్ అంటూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో విజయవంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న బన్నీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. హ్యాపీ, దేశ ముదురు, ఆర్య 2, వేదం, బద్రినాథ్, జులాయి చిత్రాల్లో తనదైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు.
ప్రస్తుతం బన్ని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాతగా తెరకెక్కుతున్న 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రం స్పెయిన్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఆడియో ఏప్రిల్ లో విడుదల చేసి, మే నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












