Don't Miss!
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 12
హైదరాబాద్: స్టైలిష్ స్టార్‌గా, సక్సెస్ ఫుల్ హీరోగా టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచిన అల్లు అర్జున్ నేటితో ఇండస్ట్రీలోకి అడగు పెట్టి 12 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. హాస్య నటుడు అల్లు రామలింగయ్య మనవడిగా, నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా.... వారసత్వం ఉండటంతో బన్నీ ఎంట్రీ చాలా సులభంగానే జరిగింది.
తొలి చిత్రం ‘గంగోత్రి' రాఘవేంద్రరావు లాంటి పెద్ద దర్శకుడితో చేయడంతో తొలి సినిమాతోనే హిట్ కొట్టాడు బన్నీ. ఈ చిత్రం మార్చి 28, 2003లో విడులైంది. గంగోత్రి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైనా తనతైన డాన్స్ టాలెంట్, యాక్షన్ పెర్ఫార్మెన్స్, సూపర్ అనిపించే నటతో.... స్టైలిష్ స్టార్‌గా ఎదిగాడు బన్నీ.
ఆర్య చిత్రంతో ఫీల్ మై లవ్ అంటూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో విజయవంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న బన్నీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. హ్యాపీ, దేశ ముదురు, ఆర్య 2, వేదం, బద్రినాథ్, జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం చిత్రాల్లో తనదైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు.
ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదలకు సిద్దమవుతోంది. భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.