Don't Miss!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రుద్రమదేవి: అల్లు అర్జున్... పని అయిపోయింది!
హైదరాబాద్: అనుష్క టైటిల్ రోల్లో గుణ టీమ్ వర్క్స్ పతాకంపై శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో గుణశేఖర్ రూపొందుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి చిత్రం 'రుద్రమదేవి'. ఈ చిత్రంలోని గోన గన్నారెడ్డి పాత్రను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పోషిస్తున్న విషయం తెలిసిందే. గత 25 రోజులుగా అల్లు అర్జున్‌పై సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా అల్లు అర్జున్ 'గోన గన్నారెడ్డి' పార్ట్ షూటింగ్ ముగిసింది.
జులై 4న హైదరాబాద్‌లోని గోపనపల్లిలో తోటతరణి సారథ్యంలో వేసిన ఏడు కోట గోడల భారీ సెట్లో షూటింగ్ ప్రారంభమైంది. అల్లు అర్జున్‌తో పాటు వందలాది జూనియర్ ఆర్టిస్టులతో షూటింగ్ జరిగింది. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్‌తో పాటు అనుష్క, రానా, ప్రకాష్ రాజ్, కృష్ణం రాజు, హంసా నందిని ఇంకా చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొన్నారు. గోన గన్నారెడ్డి అల్లు అర్జున్ సరసన నటిస్తున్న కేథరిన్ నటించింది.
రుద్రమ దేవిగా అనుష్క నటిస్తున్న ఈ మూవీలో ఇంకా రానా, కృష్ణం రాజు, సుమన్, ప్రకాష్ రాజ్, నిత్యా మీనన్, కేథరిన్, ప్రభ, జయప్రకాష్ రెడ్డి, ఆదిత్య మీనన్, ప్రసాదాదిత్య, అజయ్, విజయ్ కుమార్, వేణు మాధవ్, ఉత్తేజ్, వెన్నెల కిషోర్, కృష్ణ భగవాన్, ఆహుతి ప్రసాద్, చలపతిరావు, శివాజీ రాజా, సమ్మెట గాంధీ, అదితి చెంగప్ప, సన, రక్ష తదితరులు నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మేస్ట్రో ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రఫీ: అజయ్ విన్సెంట్, కాస్ట్యూమ్ డిజూనర్: నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, వి.ఎఫ్.ఎక్స్ సూపర్ వైజర్: కమల్ కణ్ణన్, మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఫైట్స్: విజయ్, కాస్ట్యూమ్స్: వి.సాయి బాబు, మేకప్: రాంబాబు, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె.రామ్ గోపాల్, సమర్పణ: శ్రీమతి రాగిణీ గుణ, కథ-స్ర్కీన్ ప్లే-నిర్మాత-దర్శకత్వం: గుణశేఖర్.