కరోనాపై పోరాటం.. సినీ కార్మికుల కోసం అల్లు అర్జున్ విరాళం.. బన్నీ పెద్ద మనసు
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం అతలాకుతలమవుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని రంగాలపై భారం పడుతోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్న కారణంగా రోజువారీ కూలీల ఆర్ధిక స్థితిగతులపై ప్రభావం పడింది. ఈ పరిస్థితుల్లో పెద్ద మనసుతో ముందుకొచ్చారు అల్లు అర్జున్. వివరాల్లోకి పోతే..

కరోనా విజృంభణ.. కదిలిన టాలీవుడ్ లోకం
ప్రపంచం మొత్తం కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా అని చెప్పలేం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కోరలు చాస్తోంది కరోనా వైరస్. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ కరోనా పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ పలు సూచనలు చేస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ ప్రముఖులు సైతం ముందుకొచ్చి ప్రభుత్వానికి తమ వంతు సాయం చేస్తున్నారు.

సీఎం సహాయనిధికి అల్లు అర్జున్
కరోనా దెబ్బకు ఎంతో మంది పేద ప్రజలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో పలువురు సినీనటులు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సీఎం సహాయనిధికి తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇటీవలే అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కేరళలకు ఆర్ధిక సాయం ప్రకటించారు. మూడు రాష్ట్రాలకు కలిపి రూ. 1 కోటి 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు.

కరోనా క్రైసిస్ ఛారిటీకి అల్లు అర్జున్ విరాళం
అంతేకాదు సినీ కార్మికులను ఆదుకోవడమే లక్ష్యంగా చిరంజీవి అధ్యక్షతన ప్రారంభమైన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)కి కూడా అల్లు అర్జున్ తన విరాళం అందించారు. ఛారిటీ ఛైర్మన్‌గా చిరంజీవి, సభ్యులు ఇచ్చిన పిలుపు మేరకు స్పందించిన అల్లు అర్జున్ తన వంతుగా 20 లక్షల రూపాయల సాయం అందించారు. దీంతో మొత్తంగా కరోనాపై పోరాటంలో అల్లు అర్జున్ ఆర్థిక సాయం 1 కోటి 45 లక్షలు అయింది.
Recommended Video

సుకుమార్‌తో అల్లు అర్జున్
ఇటీవలే 'అల.. వైకుంఠపురములో' సినిమాతో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











