»   » ఇది కూడా గొడవేనా? బన్నీని అనవసరంగా టార్గెట్ చేస్తున్నారే...

ఇది కూడా గొడవేనా? బన్నీని అనవసరంగా టార్గెట్ చేస్తున్నారే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొన్నిసార్లు తను కావాలని చేయక పోయినా, తన ప్రమేయం లేకుండానే వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. దీంతో తమిళనాడులో కమల్ హాసన్ అభిమానుల ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది.

బన్నీకి మర్యాద తెలియదని, పెద్దల పట్ల గౌరవంగా నడుచుకోవాల్సిన బాధ్యత లేదా? అంటూ సోషల్ మీడియాలో కమల్ హాసన్ ఫ్యాన్స్ బన్నీని ట్రోల్ చేస్తున్నారు. ఇలా జరుగడానికి కారణం ఏమిటి? ఏం జరిగింది అనే విషయంపై ఓ లుక్కేద్దాం...

ప్రో కబడ్డీ వ్యవహారంలో

ప్రో కబడ్డీ వ్యవహారంలో

ప్రొ కబడ్డీ లీగ్‌‌లో ‘తమిళ తలైవార్'జట్టును రామ్ చరణ్ తేజ్, బన్నీ కలిసి కొనుగోలు చేశారు. తమ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్ గా కమల్ హాసన్‌ ను నియమించారు. ఈ నేపథ్యంలో జట్టు ప్రమోషన్ కోసం ఈ ముగ్గురూ కలిసి చెన్నైలో జట్టు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ వివాదం తెరపైకి వచ్చింది.

మీడియా సమావేశంలో బన్నీ ప్రవర్తనే కారణం

మీడియా సమావేశంలో బన్నీ ప్రవర్తనే కారణం

తమిళ తలైవార్ జట్టును పరిచయం చేసే క్రమంలో కమల్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే వేదికపై కమల్ హాసన్, రామ్ చరణ్ తేజ్ మామూలుగానే కూర్చున్నారు. కానీ, అల్లు అర్జున్ మాత్రం కాలుమీద కాలేసుకుని కూర్చున్నాడు. ఇది తమిళ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.

ఇదేనా మర్యాద?

ఇదేనా మర్యాద?

కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటుడి ముందు అల్లు అర్జున్ కాలుమీద కాలేసుకుని కూర్చునేంత పెద్ద నటుడైపోయాడా? లెజెండరీ నటుడే ఒద్దికగా కూర్చుంటే...అల్లు అర్జున్ అలా కూర్చోవడమేంటి? సీనియర్లకు గౌరవం ఇవ్వడం కూడా తెలియదా? అంటూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.

సిల్లీ లొల్లి

సిల్లీ లొల్లి

అసలు ఇలా కూర్చోవడం వివాదం అవుతుందని అటు బన్నీ కానీ, ఇటు కమల్ హాసన్ గానీ ఊహించి ఉండరు. ఈ సిల్లీ లొల్లిని చూసి మెగా అభిమానులు సైతం విస్తుపోతున్నారు. తమిళనాడులో ఇలాంటి అభిమానులు కూడా ఉంటారా? అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

బన్నీ ఫ్యా,న్స్ కౌంటర్

కమల్ హాసన్ తమిళ ఫ్యాన్స్ చేస్తున్న విమర్శలకు బన్నీ అభిమానులు తగిన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న వివాదాలు మొగ్గలోనే తుంచేయాలని, లేక పోతే తర్వాత ఇవే పెద్ద గొడవలుగా మారుతాయని అంటున్నారు.

English summary
Kamal Haasan was roped in as the ambassador of Pro Kabaddi League (PKL) team Tamil Thalaivas. The Pics from the event, especially of Charan and Bunny have gone viral for different reasons.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu