For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టీజర్ టాక్: పవన్ కళ్యాణ్ ని కాపీ చేసిన బన్నీ

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: ‘సన్నాఫ్ సత్యమూర్తి' ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ తో అల్లు అర్జున్ మంచి ఇంప్రెషన్ కొట్టేసాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. ఈటీజర్లో అల్లు అర్జున్ స్టైలిష్ గా నడుస్తూ ఆకట్టుకున్నాడు. టీజర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరి పోయింది.

  అయితే ఈ టీజర్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది' చిత్రంలోని ఆరడుగుల బుల్లెట్ తరహాలో ఉందని అంటన్నారు. దీంతో దర్శకుడు త్రివిక్రమ్ మళ్లీ సెంటిమెంట్ రిటీట్ చేస్తాడని నమ్ముతున్నారు ఫ్యాన్స్. అయితే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ను కాపీ చేయడం చర్చనీయాంశం అయింది.

  సన్నాఫ్ సత్యమూర్తి సినిమా విషయానికొస్తే...

  షూటింగ్ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో జరుగుతోంది. అల్లు అర్జున్, సమంత, అదాశర్మపై పాటను చిత్రీకరిస్తున్నారు. అద్భుతమైన సెట్లో చిత్రీకరిస్తున్న ఈ పాటకు జానీ మాస్టర్ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. దీంతో 's/o స‌త్య‌మూర్తి' చిత్ర షూటింగ్ పూర్తవుతుంది. మార్చి 15న నోవాటెల్ లో ఈ చిత్ర ఆడియోను, ఏప్రిల్ 2న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. మ్యూజిక్ డెవిల్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతమందించారు.

  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ 's/o స‌త్య‌మూర్తి' చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్ నటిస్తున్నారు. ఇటీవ‌లే స్పైయిన్ లొ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, సమంత‌, నిత్యామీన‌న్ పై మూడు పాట‌లు చిత్రీక‌రించారు.

   Allu Arjun copies Pawan Kalyan

  ఈ సంద‌ర్భంగా నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్‌ ల కాంబినేష‌న్ లో మా బ్యానర్లో చిత్రీకరిస్తున్న 's/o స‌త్య‌మూర్తి' చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అన్నపూర్ణ సెవన్ ఎకర్స్ లో పాటను చిత్రీకరిస్తున్నాం. ఈ పాటను అల్లు అర్జున్, సమంత, అదాశర్మపై చిత్రీకరిస్తున్నాం. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన పాటలిచ్చాడు. ఈ పాటల్ని ఈనెల 15న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 2న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్ర ప్రమోషన్ ను సైతం విభిన్నంగా చేస్తున్నాం. ఇటీవలే హోళి సంద‌ర్బంగా మార్చి6న‌ ప్రీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు, అలాగే మార్చి7న ఎక్స్ టెండెడ్ ప్రీ లుక్ వీడియోకు , మార్చి 8న టైటిల్ లోగోకి, మార్చి9 న మోష‌న్ పోస్ట‌ర్స్ కి , మార్చి 10న విడుద‌ల చేసిన పోస్ట‌ర్ డిజైన్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అటు అభిమానులు ఇటు సాధారణ ప్రేక్షకులు సైతం ప్రీ లుక్ పోస్టర్స్, వీడియోను అంతగా లైక్ చేస్తున్నారంటే ఆ క్రెడిట్ మొత్తం అల్లు అర్జున్, త్రివిక్రమ్ కే చెందుకుంది. ఈ చిత్ర ప్రమోషన్ ను సైతం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెర్ ఫార్మెన్స్ మ‌రియు ల‌క్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. అని అన్నారు.

  నటీనటులు

  అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు

  సాంకేతిక వర్గం

  పి.ఆర్‌.వో- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరుశ్రీను

  ఆర్ట్ - రవీందర్

  కెమెరా - ప్రసాద్ మూరెళ్ల

  మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్

  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్

  నిర్మాత - రాధాకృష్ణ

  స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్

  English summary
  After impressing with pre-first look, title logo and motion posters, here comes the teaser of S/O Satyamurthy. This teaser just showed Allu Arjun walking around in stylish attire with a rocking music bit playing in the background.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X