twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘నా పేరు సూర్య’ నెగెటివ్ టాక్: బన్నీ రియాక్షన్, ప్లాపులున్నా ఈ స్థాయికి కారణం అదే!

    By Bojja Kumar
    |

    అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'నా పేరు సూర్య' ఇటీవల విడుదలై ఫస్ట్ షో నుండే మిక్డ్స్ టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా మీద ఎందుకు ఇలాంటి నెగెటివ్ టాక్ వచ్చింది? అంత కష్టపడి చేసిని సినిమా ఉదయం షో నుండి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకెళుతుంది అనుకుంటే..? ఊహించిన విధంగా ప్రేక్షకుల నుండి ఎందుకు రెస్పాన్స్ రాలేదు? అనే విషయమై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు దర్శకుడు వక్కంతం వంశీ, హీరో అల్లు అర్జున్.

    అందుకే మిక్డ్స్ టాక్ వచ్చింది: వక్కంతం వంశీ

    అందుకే మిక్డ్స్ టాక్ వచ్చింది: వక్కంతం వంశీ

    నా పేరు సూర్య సినిమాపై వస్తున్న నెగెటివ్ టాక్ మీద దర్శకుడు వక్కంతం వంశీ స్పందించారు. చాలా మంది ఈ సినిమా ఆర్మీ బ్యాగ్రౌండ్‌లో రన్ అవుతుందని, పెద్ద పెద్ద యుద్ధాలు ఉంటాయని భావించారు. హీరో గోల్ బోర్డర్ వెళ్లాలనేది కావడంతో... హీరో వెళ్లి పాకిస్థాన్‌తో జరిగే యుద్ధంలో పాల్గొంటాడు అని చాలా మంది భావించారు. ప్రేక్షకులు అలా ఊహించుకుంటారని మేము అసలు అనుకోలేదు.... అని వక్కంతం వంశీ తెలిపారు.

    నా ప్రతి సినిమాకు ఇది అలవాటే అంటున్న బన్నీ

    నా ప్రతి సినిమాకు ఇది అలవాటే అంటున్న బన్నీ

    సినిమా 25 నిమాషాలు ఆర్మీ బ్యాక్ డ్రాపులో పూర్తయిన తర్వాత పర్సనల్ జర్నీ మొదలు కావడంతో కొందరు డిసప్పాయింట్ అయ్యారు. అందుకే కొంత మిక్డ్స్ టాక్ వచ్చింది. సినిమాను జడ్జ్ చేసే వారు పక్కకెళ్లి జనరల్ ఆడియన్స్ ఎప్పుడైతే రావడం మొదలు పెట్టారో సినిమాను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని వక్కంతం వంశీ తెలిపారు. దీనికి బన్నీ రియాక్ట్ అవుతూ నా ప్రతి సినిమాకు ఇది అలవాటే అని వ్యాఖ్యానించారు.

    ఆ ఒక్క మూవీనే అలా హిట్ అయింది: బన్నీ

    ఆ ఒక్క మూవీనే అలా హిట్ అయింది: బన్నీ

    కొన్ని సినిమాలకు మార్నింగ్ షో నుండే టాక్ మొదలవుతుంది. అదిరిపోయిందనే ఫీడ్ బ్యాక్‌తో సూపర్ హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. నా లైఫ్‌లో ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో మార్నింగ్ షో నుండి సూపర్ హిట్ టాక్ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది ‘రేసుగుర్రం' మూవీ మాత్రమే అని బన్నీ తెలిపారు.

    అలాంటి ఏకైక హీరో మీరే: హరీష్ శంకర్

    అలాంటి ఏకైక హీరో మీరే: హరీష్ శంకర్

    మిక్డ్స్ టాక్ వచ్చినా తర్వాత పుంజుకుని బ్లాక్ బస్టర్ కొట్టే ఏకైక హీరో మీరే.... నేను మీతో ‘డిజే' సినిమా చేయక పోయినా ఈ మాట చెప్పేవాన్ని అని హరీష్ శంకర్ వ్యాఖ్యానించారు.

     నా లైఫ్ లో ఎన్ని ప్లాపులైనా కూడా ఇంత దూరం రావడానికి

    నా లైఫ్ లో ఎన్ని ప్లాపులైనా కూడా ఇంత దూరం రావడానికి

    మేము మా చేతనైంత మేర బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. అవతలివాళ్లు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మన చేతిలో ఉండదు. ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టినా కొన్ని సార్లు సినిమా అనుకున్నంత స్థాయికి వెళ్లక పోవచ్చు కానీ... ఎఫర్ట్స్ మాత్రం ఎక్కడికీ పోవు. నా లైఫ్ లో ఎన్ని ప్లాపులైనా కూడా ఇంత దూరం రావడానికి కారణం ఓన్లీ ఎఫర్ట్స్.... అని అల్లు అర్జున్ అన్నారు.

     అలా హిట్టయినా అది నాకు అంటదు: బన్నీ

    అలా హిట్టయినా అది నాకు అంటదు: బన్నీ

    ప్రతి సినిమాకు నా శక్తిమేర కష్టపడుతున్నాను. ఒక వేళ ఎఫర్ట్స్ తక్కువ అయి...సినిమా హిట్టయినా అది నాకు అంటదు అని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు.

    English summary
    Allu Arjun counter to negative talk for Naa Peru Surya. Naa Peru Surya, Naa Illu India Film written and directed by Vakkantham Vamsi in his directorial debut. Produced by Shirisha and Sridhar Lagadapati under the banner Ramalakshmi Cine Creations, it stars Allu Arjun and Anu Emmanuel in the lead roles.The film opened to mixed to negative reviews from critics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X