Don't Miss!
- News ఉండి టీడీపీలో వార్ - మారుతున్న లెక్కలు, ఆడియో వైరల్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అల్లు అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి రాబోతున్న మరో యువ హీరో.. ఫిన్నెస్తోనే షాక్ ఇచ్చాడుగా!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్ర హీరోల ఫ్యామిలీ నుంచి నటీనటులు చాలా మందే వస్తున్నారు. ఏడాదికి ఎవరో ఒక యాక్టర్ ఫ్యామిలీ నుంచి యువ హీరోలను పరిచయం చేస్తూనే ఉన్నారు. అయితే అందులో కొందరు మాత్రమే బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకుంటున్నారు. త్వరలోనే అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి కూడా మరో యంగ్ టాలెంటెడ్ హీరో రాబోతున్నట్లు తెలుస్తోంది. అతను ఫిట్నెస్ తో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాడు. అతని మొదటి సినిమా టైటిల్ కూడా ఫిక్స్ అయ్యింది.
బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లేకపోయినా
ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మెగా ఫ్యామిలీ బంధువే కాబట్టి అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మెగా క్రేజ్ బాగానే హెల్ప్ అయ్యింది. ఇక ఆ తరువాత మెల్లగా బన్నీ తనకంటూ ఒక స్టార్ డమ్, మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లేకపోయినా కూడా హార్డ్ వర్ల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పిన అతికొద్ది మంది హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు.
తండ్రికి శ్రమ లేకుండా..
మొదటి సినిమా నుంచి కూడా అల్లు అర్జున్ తన ఆలోచనాలతోనే సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. కొడుకు కెరీర్ పై అల్లు అరవింద్ ఏనాడు కూడా పెద్దగా టెన్షన్ పడలేదు. అయితే చిన్నవాడు అయిన అల్లు శిరీష్ కెరీర్ కోసం మాత్రం అల్లు అరవింద్ చాలానే ఆలోచించారు.
అల్లు ఫ్యామిలి నుంచి మరో హీరో
ఇక త్వరలోనే అల్లు ఫ్యామిలీ నుంచే మరో యువ హీరో రానున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ కజిన్ అయినటువంటి విరన్ ముత్తంశెట్టి అనే యువకుడు చాలా కాలంగా వెండితెరపై ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ యువకుడు బతుకు బస్టాండ్ అనే కథతో రెడీ అవుతున్నాడు. IVR అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ఫిట్నెస్ తో షాక్ ఇస్తున్నాడు
విరన్ కు మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ అంటే చిన్నప్పటి నుంచి విరన్ కు చాలా క్లోజ్. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అల్లు అర్జున్ కు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తూనే ఉంటారు. ఇక మనోడు ఫిట్నెస్ తో కూడా షాక్ ఇస్తున్నాడు. ఒకప్పుడు చబ్బీగా ఉన్న విరన్ ఇప్పుడు సినిమా కోసం చాలా తగ్గిపోయి ఓ వర్గం వారిని అమితంగా ఆకట్టుకుంటున్నాడు.
ప్రొడక్షన్ హౌజ్ కూడా..
ఇక విరన్ చేయబోయే మొదటి సినిమా బస్ స్టాండ్. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు IVR అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక విరన్ ఫాదర్ కు ముత్తం శెట్టి అనే ప్రొడక్షన్ హౌజ్ కూడా ఉంది. అందులో అల్లు అర్జున్ పుష్ప తెరకెక్కుతోంది. వాళ్ళు మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి ఆ పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నారు.