అల్లు అర్జున్... ఫ్యాన్ ఫాలోయింగ్ అదుర్స్
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతోంది. అత్యధిక మంది ఉపయోగించే సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్‌లో ఈ విషయం స్పష్టం అవుతోంది. ఒక తెలుగునాటే కాకుండా.... కర్నాటక, కేరళల్లోనూ భారీగా అభిమానులను సంపాదించుకున్న అల్లు అర్జున్ తాజాగా ఫేస్ బుక్‌లో అర మిలియన్(5 లక్షలు)ల ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. అల్లు అర్జున్ ఇటీవల నటించిన 'జులాయి' చిత్రం మంచి విజయం సాధించడం కూడా ఇంత మంది ఫాలోవర్స్ ను సంపాదించుకోవడానికి మరో కారణం.
ప్రస్తుతం అల్లు అర్జున్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈచిత్రం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల శివబాబు సమర్పణలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
'ఇద్దరమ్మాయిలతో' చిత్రం నుండి టాలీవుడ్లో కొత్త ట్రెండ్ మొదలవ్వబతోంది. ఈ సినిమా కోసం ఫిల్మ్ రీల్ అవసరం లేని అత్యాధునికమైన 'ఆర్రి అలెక్నా కెమెరా సిస్టమ్స్' కొనుగోలు చేసారు. ఈ కెమెరాల ద్వారా హై క్వాలిటీ ఔట్ పుట్ వస్తుంది. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీని 'లైఫ్ ఆఫ్ పై', స్కైఫాల్, అవెంజర్స్ లాంటి చిత్రాల్లో వాడారు. తెలుగులో తొలిసారిగా 'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి వాడుతున్నారు.
ప్రేమకథా నేపథ్యంలో పూరి స్టయిల్ లో ఈచిత్రం సాగుతుంది. ఇద్దరు అమ్మాయిలతో ఫారిన్ లో ప్రేమలో పడి వారితో హీరో పడే పాట్లు... అనే పాయింట్ చుట్టూ సినిమా తిరుగుతుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ.


Click it and Unblock the Notifications











