రామ్ చరణ్ తో కలిసి నటిస్తా: అల్లు అర్జున్
రామ్ చరణ్ తేజ్ తో కలిసి నటిస్తానని సినీ హీరో అల్లు అర్జున్ అన్నారు. రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు వేడుకలు శనివారం జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా అల్లు అర్జున్ హాజరై కేక్ కట్ చేసి రక్త దానం చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ధియోటర్ దినేత్సవం ఓ ప్రక్క ...రామ్ చరణ్ తేజ జన్మదినం మరో ప్రక్క జరగటం ఆనందంగా ఉందన్నారు. ధియోటర్ ఆర్ట్స్ కు చిరంజీవి కొత్త నిర్వచనాన్ని చెప్పి గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారని ఆయన మార్గంలోనే తాము కూడా పయినిస్తున్నామని అన్నారు. రామ్ చరణ్ షూటింగ్ నిమిత్తం ఆస్ట్రేలియాలో ఉండటం కొంత బాధగా ఉందని,గత సంవత్సరం కూడా చరణ్ చిరుత షూటింగ్ నేపధ్యంలో అందుబాటులో లేరని తెలిపారు.
ఏదైమైనా చిరంజీవి అభిమానులు ప్రజా సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించటం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది రక్త దానం చేస్తున్నారని అన్నారు. రామ్ చరణ్ తేజ్ తో కలిసి చేస్తానని, అందుకు కొంత సమయం పడుతుందని అన్నారు. అనంతరం చిరంజీవి అభిమానులు రక్త దానం చేసారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











