10వ తరగతి పద్యాన్ని అలవోకగా చెప్పిన బన్నీ కుమార్తె..అల్లు అర్హ టాలెంట్ కు బాలకృష్ణ ఫిదా..
Allu Arha in Unstoppable 4: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' (Unstoppable with NBK). ఈ షోలో సీజన్ 4లోని 4వ ఎపిసోడ్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా విచ్చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఎపిసోడ్ స్పెషల్ అట్రాక్షన్ గా బన్నీ కూతురు ఆర్హ, కొడుకు అయాన్ లతో వచ్చి సందడి చేశాడు. ఈ సమయంలో అల్లు అర్హ తెలుగు పద్యం పాడి బాలకృష్ణను ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
నందమూరి బాలకృష్ణ హోస్ట గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 సీజన్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ స్పెషల్ ఎపిసోడ్లో బన్నీ కుమార్తె అర్హ, కొడుకు అయాన్ కూడా వచ్చి సందడి చేశారు. బాలయ్య కూడా బన్నీ పిల్లలను ఆటపట్టించాడు. ఈ సమయంలో.. 'అర్హ నీకు తెలుగు వచ్చా? ' అని బాలకృష్ణ అడగగా.. 'తెలుగు వచ్చా అదరగొడుతుంది'.. అంటూ బన్నీ రిప్లై ఇచ్చాడు. ఇంతలోనే.. చిన్నారి అర్హ .. 'అటజని కాంచె భూమిసురు డంబర చుంబి.. 'అంటూ పదవ తరగతి లోని క్లిష్టమైన తెలుగు పద్యాన్ని మొత్తం.. ఎలాంటి తడబాటు లేకుండా.. అవలీలగా చెప్పేసింది.

బన్నీ కుమార్తె అర్హ చూసి.. బాలకృష్ణ షాక్ అయ్యాడు. బన్నీ కూతురి టాలెంటెడ్ కు ఫిదా అయినా బాలకృష్ణ.. అర్హను దగ్గరికి తీసుకొని.. 'నిన్ను చూస్తే.. తెలుగు ఇంకా నాలుగు కాలాల పాటు బతికి ఉంటుందనిపిస్తుంది' అంటూ ప్రశంసిస్తాడు. 8 ఏళ్ల చిన్నారి అర్హ ..గుక్క తిప్పుకోకుండా క్లిష్టమైన తెలుగు పద్యాన్ని అలవోకగా చెప్పడం చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. చిన్నారి అర్హ.. ఇంత బాగా తెలుగు మాట్లాడుతుందా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిన్నప్పటినుండి బన్నీ తన కూతురికి తెలుగు నేర్పించడం గ్రేట్ అంటూ అల్లు అర్జున్ పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక అయాన్ కూడా తన చేష్టలతో ఈ స్పెషల్ షోలో అట్రాక్ట్ గా నిలిచాడు. పుష్ప డైలాగ్ చెప్పి.. మెస్మరైజ్ చేస్తారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్ లో తెగ వైరల్ అవుతుంది.
8 year old star kid intha fluent Telugu matladadam. Parenting standards of Bunny and Sneha 👌♥️#UnstoppableWithNBK @alluarjun pic.twitter.com/fdiVnNJkhE
— Mad Max (@madmaxtweetz) November 19, 2024
ఇదెలా ఉంటే.. అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 గురించి చర్చ జరుగుతోంది. ఈ మూవీకి సన్సెషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా జంటగా నటిస్తున్నారు. అలాగే ఈ మూవీలో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్, సునీల్, జగపతి బాబు, అనసూయ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై మరింత హైప్ పెంచేసింది. సోషల్ మీడియాలో హల్ చేస్తోంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ మారింది. ఇక డిసెంబర్ 5న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే పుష్ప 2 ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్.


Click it and Unblock the Notifications











