నువ్వు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోను: అల్లు అర్జున్ కూతురు వీడియో వైరల్!
అల్లు అర్జున్ కూతురు తన తండ్రి చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోనంటోంది. మూడేళ్ల వయసు కూడా లేని ఈ పాప అప్పుడే పెళ్లి బంధం గురించి మాట్లాడటం ఏమిటా? అనుకుంటున్నారా... మీరు నమ్మినా, నమ్మక పోయినా ఇది నిజం!
స్టైలిష్ స్టార్ తాజాగా తన సోషల్ మీడియా పేజీలో ఓ ఫన్నీ వీడియో పోస్టు చేశారు. అందులో బన్నీ... తన కూతురు అర్హను 'నేను చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అడగ్గా, నేను చేసుకోనంటూ' ఆ చిన్నది ముద్దు ముద్దుగా సమాధానం ఇవ్వడం నెటిజన్లు ఆకట్టుకుంటోంది.
వైరల్ అవుతున్న వీడియో
బన్నీ పోస్ట్ చేసిన ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మై దొంగ ఫెల్లో' అంటూ బన్నీ ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాలో ఈ వీడియో షేర్ చేయగా కొన్ని నిమిషాల్లోనే లక్షల మందికి రీచ్ అయింది. అర్హ మాటలు ఎంతో ముద్దుగా ఉన్నాయంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

పిల్లలతో గడుపుతున్న బన్నీ
‘నాపేరు సూర్య' తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో కాస్త గ్యాప్ తీసుకున్న బన్నీ తన పూర్తి సమయాన్ని పిల్లలతో గడుపుతున్నారు. ముఖ్యంగా కూతురు అర్హ అంటే బన్నీకి ఎనలేని ప్రేమ. అర్హను నాన్నకూచి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అల్లు అర్హ
నవంబర్ 21, 2016న జన్మించిన అర్హ... ఇటీవలే తన రెండో పుట్టినరోజు జరుపుకుంది. అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ మొదలైతే పిల్లలతో గడిపే సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రస్తుతం తన ఖాళీ సమయాన్నంతా వారితోనే గడుపుతున్నారు.

అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ
అల్లు అర్జున్ తన నెక్ట్స్ మూవీ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నారు. అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ(చినబాబు) సంయుక్తంగా నిర్మించనున్న ఈ మూవీ త్వరలో ప్రారంభం కాబోతోంది. బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాలు బాక్సాఫీసు వద్ద విజయం సాధించాయి.


Click it and Unblock the Notifications











