»   » ఎన్టీఆర్, రవితేజ ఇప్పుడు బన్నితో

ఎన్టీఆర్, రవితేజ ఇప్పుడు బన్నితో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంగీత దర్శకుడు తమన్ కు హీరోల చేత పాడించటంలో రికార్డ్ ఉంది. రవితేజ, ఎన్టీఆర్ ల చేత గతంలో పాడించిన తమన్ దృష్టి ఇప్పుడు అల్లు అర్జున్ పై పడింది. ఆయన పాడించితే ఆ కిక్ ఎలా ఉంటుందో మనకు చూపబోతున్నాడు.

ఇన్నాళ్లూ అల్లు అర్జున్ డాన్సింగ్ స్కిల్స్ చూసాం. ఇప్పుడు సింగింగ్ స్కిల్స్ ని కూడా చూడబోతున్నాం. అల్లు అర్జున్ ని పాట పాడటానికి ఒప్పించాడు సంగీత దర్శకుడు తమన్. బోయపాటి తో చేస్తున్న సరైనోడు చిత్రం కోసం బన్నీ పాడబోతున్నాడు. ఈ మేరకు రికార్డింగ్ ధియేటర్ లో తీసిన ఫొటోని మీరు ఇక్కడ చూడవచ్చు.

 Allu Arjun debuts as singer

అల్లు అర్జున్-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్నా'సరైనోడు' ఫస్ట్ లుక్ ని క్రితం నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తే ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లో అల్లుఅర్జున్ సరసన రకుల్ ప్రీత్‌సింగ్, కేథరిన్ నటిస్తున్నారు.


‘సరైనోడు'లో యాక్షనే హైలెట్‌గా నిలవబోతోందని సమాచారం. బోయపాటి శ్రీను ఎప్పుడూ యాక్షన్‌కే పెద్దపీట వేస్తుంటారు. అయితే ఈసారి ఓ ప్రేమకథతో సినిమా తీయబోతున్నారని ఆమధ్య చెప్పుకొన్నారు.

మరి ‘సరైనోడు' కథేంటో తెలియదు కానీ... ఇందులోనూ బన్నీ, బోయపాటి శైలికి తగ్గట్టుగా యాక్షన్‌ సన్నివేశాల్ని జోడించారని చెప్పుకుంటున్నారు. ఓ యాక్షన్‌ ఘట్టానికి ముగ్గురు ఫైట్‌ మాస్టర్లు పనిచేశారని చిత్ర యూనిట్ చెప్తోంది. భారీ జనసందోహం మధ్య తీసిన ఆ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది.

 Allu Arjun debuts as singer

బన్నీ మాస్‌ హీరోనే అయినప్పటికీ కొంతకాలంగా ఆయన కుటుంబ కథలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా ఇంటిల్లిపాదీ కలిసి చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తరహా కథలకే పచ్చజెండా వూపుతున్నాడు.

‘సన్నాఫ్‌ సత్యమూర్తి'తో ఇంటిల్లిపాదినీ అలరించిన ఆయన తదుపరి విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో చేయబోయే కథ కూడా అలాంటిదేనట. ‘మనం'తో సత్తా చాటాడు విక్రమ్‌. బన్నీకి కూడా అలా గుర్తుండిపోయే సినిమాని ఇవ్వాలన్న ప్రయత్నంలో ఆయన ఉన్నట్టు తెలిసింది. ఈ యేడాది మార్చిలో బన్నీ-విక్రమ్‌ కలయికలో సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి.

English summary
SS Thaman convinced Allu Arjun that his voice is apt for a song in 'Sarrinodu'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu