ఆ చిత్ర విదేశీ హక్కులకు రూ.80 లక్షలు!!!
బొమ్మరిల్లు సినిమాకు దర్శకత్వం వహించిన భాస్కర్, హీరో అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు బిజినెస్ పరంగా అపుడే విపరీతమైన క్రేజ్ ను సృష్టిస్తోంది. సగభాగం సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకున్న ఈ సినిమా వచ్చే సంవత్సరంలో విడుదల కానున్నది. అయితే ఈ సినిమా పంపిణీ హక్కుల కోసం యమ పోటీ నెలకొన్నది. విదేశీ పంపిణీ హక్కులు అపుడే అమ్ముడుపోయాయి. బొమ్మరిల్లు, మున్నా, తాజాగా హ్యాపీ డేస్ చిత్రాల విదేశీ హక్కులను పొందిన ఆర్.కె.ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అల్లు అర్జున్ తాజా చిత్రాన్ని రూ.80 లక్షలకు సొంతం చేసుకున్నట్టు సమాచారం. బొమ్మరిల్లు సినిమాను నిర్మించిన దిల్ రాజు ఈ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











