దిల్ రాజు హ్యాట్రిక్ ‘లవర్’ అల్లు అర్జున్...!
అక్కినేని నాగచైతన్య తో వాసు వర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'జోష్" ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ వాసు వర్మ దర్శకత్వం సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరో చిత్రం చేయబోతున్నాడని సమాచారం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో 'ఆర్య", 'పరుగు" లాంటి హిట్ చిత్రాలను నిర్మించిన దిల్ రాజు ఈ తాజా చిత్రంలో కూడా అల్లు అర్జున్ ని హీరోగా పెట్టుకోవాలనుకుంటున్నాడట. ఈ చిత్రానికి 'లవర్"అనే టైటిల్ ఖరారు చేసారని సమాచారం.
ఇటివల కాలంలో పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించి మంచి పేరు తెచ్చుకున్న సంగీత దర్శకుడు తమన్ తోలిసారి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నాడు. ఆల్ రెడీ మ్యూజిక్ సిట్టంగ్స్ హైదరాబాద్ లో ఆరంభమయ్యాయని సమాచారం. బద్రీనాథ్ సినిమా తరవాత అల్లు అర్జున్ నటించబోయే చిత్రం ఇదే అని తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దిల్ రాజు సంస్థ లో అల్లు అర్జున్ కు ఆర్య, పరుగు చిత్రాల తరవాత ఇది హ్యాట్రిక్ చిత్రం కాబోతున్నది.


Click it and Unblock the Notifications











