twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భార్యతో కలిసి ముంబైలో డేట్‌కు వెళ్లిన అల్లు అర్జున్!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Allu Arjun Dinner Date With His Wife

    'నా పేరు సూర్య' సినిమా షూటింగ్ సమయంలో చాలా రోజుల పాటు ఇంటికి దూరంగా గడిపిన అల్లు అర్జున్... సినిమా రిలీజ్ అవ్వడం, ప్రమోషన్స్ కూడా పూర్తవ్వడంతో ఫుల్ రిలాక్సింగ్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. తన పూర్తి సమయాన్ని కుటుంబం కోసమే కేటాయించారు. తాజాగా బన్నీ తన భార్య స్నేహారెడ్డితో కలిసి ముంబైలో ప్రత్యేక్షమయ్యారు. డిన్నర్ డేట్ కోసమే ఈ జంట ముంబై వచ్చినట్లు తెలుస్తోంది. ముంబైలోని ఓ ఫేమస్ రెస్టారెంటు నుండి బయటకు వస్తుండగా ఇద్దరూ మీడియా కెమెరాలకు చిక్కారు.

     ముంబైలోనూ బన్నీపై మీడియా అటెన్షన్

    ముంబైలోనూ బన్నీపై మీడియా అటెన్షన్

    ముంబై రెస్టారెంట్ నుండి అల్లు అర్జున్ తన భార్యతో బయటకు రాగానే అక్కడ ఉన్న మీడియా ఫోటోగ్రాఫర్ల అటెన్షన్ ఈ జంట వైపు మళ్లింది. బన్నీ నటించిన సినిమాలు హిందీలో కూడా డబ్ అయి విడుదలవుతుండటం వల్ల అక్కడ కూడా బన్నీకి పాపులారిటీ పెరుగుతుంది అనడానికి ఇదొక నిదర్శనం.

    అందుకే ముంబైకి...

    అందుకే ముంబైకి...

    హైదరాబాద్‌లో డిన్నర్ డేట్ వెళదామంటే ఏ హోటల్ వెళ్లినా, ఏ రెస్టారెంట్ వెళ్లినా..... అభిమానుల చుట్టూ చేరి హడావుడి చేస్తుంటారు. ప్రైవసీ కోసమే బన్నీ తన భార్యతో కలిసి ముంబైకి డిన్నర్ డేట్ వెళ్లినట్లు తెలుస్తోంది.

     రిలాక్స్‌గా కథలు వింటున్న బన్నీ

    రిలాక్స్‌గా కథలు వింటున్న బన్నీ

    ‘నా పేరు సూర్య' సినిమా తర్వాత అల్లు అర్జున్ అఫీషియల్‌గా ఏ సినిమాకు కమిట్ కాలేదు. రొటీన్ కథతో కాకుండా భిన్నమైన, బాక్సాఫీసు వద్ద బాగా వర్కౌట్ అయ్యే కథతో నెక్ట్స్ సినిమా మొదలు పెట్టాలని అల్లు అర్జున్ ప్లాన్ చేసుకుంటున్నారు.

    నా పేరు సూర్య

    నా పేరు సూర్య

    ‘నా పేరు సూర్య' బాక్సాఫీసు వద్ద యావరేజ్‌గా ఆడినప్పటికీ..... బన్నీ పెర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా కోసం బన్నీ పడ్డ కష్టం తెరపై స్పష్టంగా కనిపించింది. అయితే ప్రేక్షకులు ఊహించిన స్థాయిలో కథ ఉండక పోవడంతో అనుకున్న ఫలితాలు సాధించలేదు. అందుకే తన తర్వాతి సినిమా విషయంలో బన్నీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

    English summary
    Allu Arjun,as spotted last night at a popular eatery in Mumbai with wife Sneha Reddy. The two enjoyed a dinner date in Mumbai and were clicked while exiting from the restaurant. Both of them looked stunning together as they flaunted their casual look.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X